News July 7, 2024
అనంత: మెట్రిక్ టన్నుకు రూ.195

ఇసుక పూర్తిగా ఉచితమే. కానీ.. లోడింగ్, రాయల్టీ కింద మెట్రిక్ టన్ను ఇసుకకు రూ.195 నిర్ణయించారు. లబ్ధిదారునికి రోజుకు 20 మెట్రిక్ టన్నులు మాత్రమే అందిస్తారు. ఆధార్ కార్డు, ఫోన్ నంబరు, డెలివరీ చిరునామా తప్పనిసరిగా అందించాలి. ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే పంపిణీ చేస్తారు. అయితే డిపో నుంచి డెలివరీ చేయడానికి రవాణా ఛార్జీ కింద ఎంత వసూలు చేయాలనే దానిపై ఆదివారం వెల్లడించే అవకాశం ఉంది.
Similar News
News July 7, 2025
రాయదుర్గంలో వ్యక్తి ఆత్మహత్యాయత్నం

రాయదుర్గంలోని గ్యాస్ గోడౌన్ ఏరియాలో నివాసముంటున్న చాంద్‌బాషా ఆదివారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. పోలీసుల వివరాల మేరకు.. బాషా ఆర్థిక సమస్యలతో సతమతమవుతూ జీవితంపై విరక్తి చెంది రైలు పట్టాల మీద కూర్చున్నాడు. ఈ క్రమంలో రైలు ఢీ కొట్టింది. గమనించిన లోకోపైలట్ సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రుడిని రాయదుర్గం ప్రభుత్వాసుపత్రికి తరలించామన్నారు.
News July 7, 2025
అనంతలో చికిత్స పొందుతూ వ్యక్తి మృతి

రోడ్డు ప్రమాదంలో గాయపడి అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తిప్పే స్వామి (52) సోమవారం మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. బెళుగుప్ప మండలం ఎర్రగుడికి చెందిన తిప్పేస్వామి ఆదివారం కణేకల్లు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. క్షతగాత్రుడిని కుటుంబ సభ్యులు అనంతపురం ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
News July 7, 2025
పామిడిలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక

పామిడిలోని జగన్నాథ పద్మావతి కన్వెన్షన్ హాల్‌లో సోమవారం కలెక్టర్ డా.వినోద్ కుమార్ ఆధ్వర్యంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించారు. ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, జాయింట్ కలెక్టర్ శివనారాయణ శర్మ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రజల నుంచి వివిధ సమస్యలపై అర్జీలు స్వీకరించారు. వాటిని పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తెలిపారు.