News June 30, 2024

అనంత: రూ.11 లక్షలతో ఉడాయించిన ఆర్బీకే అధికారి

image

కుందుర్పి మండలం జంబుగుంపుల రైతు భరోసా కేంద్రం విలేజ్ హార్టికల్చర్ అసిస్టెంట్ (వీహెచ్ఏ) ప్రవీణ్ రూ.11 లక్షల నగదుతో 10 రోజుల క్రితం ఉడాయించాడు. ఈ ఘటనపై మండల వ్యవసాయ అధికారి మహేశ్ ఆదివారం పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రాయితీ విత్తనాలు విక్రయించగా రూ.17 లక్షలు వచ్చాయని, అందులో ప్రవీణ్ రూ.11 లక్షలు తీసుకొని పరారయ్యాడని పేర్కొన్నారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Similar News

News September 19, 2024

ఫ్రీ హోల్డ్ భూముల రిజిస్ట్రేషన్ పరిశీలన 25 లోగా పూర్తి కావాలి: కలెక్టర్

image

శ్రీ సత్యసాయి జిల్లాలో జరుగుతున్న ఫ్రీ హోల్డ్ భూముల రిజిస్ట్రేషన్ పరిశీలన ఈనెల 25వ తేదీ లోపు పూర్తి చేయాలని కలెక్టర్ టీఎస్ చేతన్ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయన మాట్లాడారు. ఫ్రీ హోల్డ్ భూముల రీ వెరిఫికేషన్‌కు సంబంధించి ప్రభుత్వం జారీ చేసిన నిబంధనలను దృష్టిలో ఉంచుకొని, క్షేత్రస్థాయిలో వాటిని పటిష్టంగా అమలు చేయాలన్నారు.

News September 19, 2024

అనంత: క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్ అభిమానులకు గుడ్ న్యూస్

image

టీమిండియా క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్ అభిమానులకు గుడ్ న్యూస్‌గా చెప్పవచ్చు. గాయం నుంచి కోలుకున్న సూర్య, అనంతపురంలోని ఆర్డీటీ స్టేడియంలో రేపు జరుగనున్న దులీప్ ట్రోఫీలో బరిలోకి దిగనున్నారు. ఇండియా-బి జట్టు తరఫున బరిలో దిగనున్నారు. సూర్యకుమార్ యాదవ్ స్కై షాట్స్ కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు.

News September 18, 2024

శ్రీ సత్యసాయి జిల్లాలో రేపటి నుంచి ఉచిత ఇసుక సరఫరా

image

ప్రభుత్వ కొత్త మార్గదర్శకాల మేరకు శ్రీ సత్యసాయి జిల్లాలో గురువారం నుంచి ఉచిత ఇసుక ప్రారంభిస్తున్నట్లు కలెక్టర్ టీఎస్ చేతన్ తెలిపారు. కలెక్టరేట్లో జిల్లా ఉన్నతాధికారులతో ఇసుక తరలింపుపై సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. తాడిమర్రి మండలం సీసీ రేవు, ముదిగుబ్బ మండలం పీసీ రేవు వద్ద ఇసుక సరఫరాకు అనుమతి ఉందన్నారు. ప్రతి రోజు ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు లోడింగ్ ఉంటుందన్నారు.