News March 2, 2025

అనంత: రోడ్డు ప్రమాదంలో మహిళ దుర్మరణం

image

కూడేరు మండలం కమ్మూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటోను కారు ఢీకొన్న ఘటనలో సరస్వతి అనే మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. ఆటోలో ఉన్న మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు 108 వాహనానికి సమాచారం అందించగా వారు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సీఐ రాజు, ఆయన సిబ్బంది ప్రమాదం జరిగిన స్థలానికి చేరుకుని పరిశీలించారు.

Similar News

News November 5, 2025

తిరుపతి: హాస్టల్‌లో విద్యార్థులపై లైంగిక దాడి.?

image

తిరుపతిలోని ఓ బాలుర హాస్టల్లో దారుణం చోటు చేసుకుంది. నైట్ వాచ్‌మెన్ ఇద్దరు మైనర్ బాలురుపై లైంగిక దాడికి పాల్పడినట్లు తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నెల 3న ఓ బాలుడు ఈ విషయాన్ని పేరంట్స్‌కు ఫోన్ ద్వారా చెప్పగా వెంటనే వారు వార్డెన్‌కు సమాచారం ఇచ్చారు. బాధితుల తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు అలిపిరి పోలీసులు పోక్సో, SC, ST యాక్ట్ సహా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

News November 5, 2025

హనుమకొండలో ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీ

image

TG: ఈ నెల 10 నుంచి 22 వరకు హనుమకొండలోని జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలో ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీ జరగనుంది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల అభ్యర్థులు ఇందులో ఎన్‌రోల్ చేసుకోవచ్చు. జనరల్ డ్యూటీ, టెక్నికల్, క్లర్క్/స్టోర్ కీపర్, ట్రేడ్స్‌మన్ పోస్టుల భర్తీకి సంబంధించి మార్చి 12న అడ్మిట్ కార్డులు పొందిన వారికే ఈ అవకాశం అని అధికారులు వెల్లడించారు. పూర్తి వివరాలకు 040-27740059కు కాల్ చేయాలని సూచించారు.

News November 5, 2025

2,400 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీ : UTF

image

కర్నూలు, నంద్యాల జిల్లాల్లో ఉపాధ్యాయుల కొరత తీవ్రంగా ఉందని, ప్రభుత్వం ప్రత్యేక డీఎస్సీ నిర్వహించాలని UTF జిల్లా కార్యదర్శి కౌలన్న, రాష్ట్ర కౌన్సిలర్ ఎల్లప్ప, మండల అధ్యక్షుడు పెద్దారెడ్డి డిమాండ్ చేశారు. మంగళవారం కోసిగిలో వారు మాట్లాడుతూ.. ఉమ్మడి కర్నూలు జిల్లాలో అన్ని కేటగిరీలు కలుపుకొని సుమారుగా 2,400 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీ ఉన్నాయన్నారు. ప్రభుత్వం వాటి భర్తీకి చర్యలు తీసుకోవాలన్నారు.