News February 12, 2025

అనంత: ‘వేతనాలు చెల్లించకుంటే నిరవధిక సమ్మె’

image

అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న పారిశుధ్యం కార్మికులకు బుధవారం వేతనాలు చెల్లించకుంటే నిరవధిక సమ్మె చేపట్టనున్నట్లు AITUC నగర కార్యదర్శి కృష్ణుడు పేర్కొన్నారు. మంగళవారం ఆసుపత్రి సూపరింటెండెంట్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు. సమస్య పరిష్కరించాలని అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా సమస్య పరిష్కారం చేయలేదని అన్నారు.

Similar News

News March 14, 2025

డ్రోన్‌లతో ప్రత్యేక నిఘా: ఎస్పీ

image

మత సామరస్యం పాటిస్తూ సంతోషకర వాతావరణంలో హోళి పండగ జరుపుకోవాలని అనంతపురం ఎస్పీ జగదీశ్ ప్రజలకు సూచించారు. ఎదుటివారి మనోభావాలు దెబ్బతినేలా వ్యవహరించడం, ఇబ్బందులు కలిగించడం వంటివి చేయరాదన్నారు. కీలక ప్రదేశాలు, కాలనీలు, రహదారులపై సీసీ కెమెరాలు ఉండటంతో పాటు డ్రోన్లతో నిఘా పెట్టామన్నారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలు, కుట్రలు చేస్తే చట్టపరమైన చర్యలు చేపడతామని హెచ్చరించారు.

News March 13, 2025

అందరూ సమష్టిగా పని చేయాలి: RJD

image

అనంతపురం జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ ఆదేశాల మేరకు స్థానిక SSBN డిగ్రీ కళాశాలలోని వర్చువల్ రూమ్‌లో CS, DOలకు వర్చువల్ ప్రోగ్రామ్ జరిగింది. పదో పరీక్షలు ఈనెల 17 నుంచి ప్రారంభం కానున్నాయని RJD శ్యామ్యూల్ తెలిపారు. చీప్ సూపర్వైజర్, డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ అందరూ సమష్టిగా పని చేయాలన్నారు. పరీక్ష కేంద్రంలోకి స్మార్ట్ వాచ్, ఎలక్ట్రానిక్ వస్తువులు, మొబైల్ ఫోన్స్ తీసుకెళ్లరాదని సూచించారు.

News March 13, 2025

రామాయణం రాసిన తొలి కవియిత్రి అతుకూరి మోలమాంబ: కలెక్టర్

image

రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు కవియిత్రి అతుకూరి మోలమాంబ జయంతి అనంతపురం జిల్లాలో ఘనంగా జరిగింది. అనంతపురం నగరంలోని రెవెన్యూ భవన్‌లో కవియిత్రి అతుకూరి మోలమాంబ చిత్రపటానికి కలెక్టర్ వినోద్ కుమార్ పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. రామాయణం రాసిన తొలి కవియిత్రి అతుకూరి మోలమాంబ అని జిల్లా కలెక్టర్ తెలిపారు. నాట్య పోటీల్లో గెలిచిన విద్యార్థులకు కలెక్టర్ బహుమతి ప్రదానం చేశారు.

error: Content is protected !!