News January 3, 2026
‘అనంత’ షార్ట్ ఫిలిం ఫెస్టివల్ పోస్టర్ ఆవిష్కరణ

8వ అనంత షార్ట్ ఫిలిం ఫెస్టివల్-2026 పోస్టర్‌ను కలెక్టర్ ఓ.ఆనంద్ శుక్రవారం ఆవిష్కరించారు. ఫిల్మ్ సొసైటీ అధ్యక్షుడు రషీద్ బాషా మాట్లాడుతూ.. ఏడేళ్లుగా అనంత షార్ట్ ఫిలిం ఫెస్టివల్ నిర్వహిస్తున్నామన్నారు. షార్ట్ ఫిలిం తీసిన వారి ప్రతిభను గుర్తించే విధంగా స్క్రీనింగ్ చేసి, అందులో ఉత్తమ షార్ట్ ఫిలిమ్స్ పొందిన వారికి అవార్డులను అందిస్తామన్నారు.
Similar News
News February 6, 2026
సేవాలాల్ మహరాజ్ జయంతికి సమగ్ర ఏర్పాట్లు: జాయింట్ కలెక్టర్

శ్రీ సేవాలాల్ మహరాజ్ జయంతి వేడుకలను ఇబ్బందులు లేకుండా విజయవంతంగా నిర్వహించాలని జాయింట్ కలెక్టర్ సి.విష్ణుచరణ్ అధికారులను ఆదేశించారు. ఫిబ్రవరి 13, 14, 15 తేదీల్లో గుత్తి మండలం సేవాగఢ్‌లో జయంతి ఉత్సవం జరగనుంది. ఈ సందర్భంగా పోలీస్ బందోబస్తు, ట్రాఫిక్ నియంత్రణ, ఆర్టీసీ బస్సులు, తాగునీరు, విద్యుత్, శానిటేషన్, వైద్య శిబిరాలు, అంబులెన్సులు ఏర్పాటు చేసి శాఖల మధ్య సమన్వయంతో కార్యక్రమాలు చేపట్టాలన్నారు.
News February 6, 2026
అంగన్వాడీ స్కూళ్లలో పిల్లలకు అందని ఐరన్ సిరప్

అనంతపురం జిల్లాలో ఉన్న 2,302 అంగన్వాడీ స్కూళ్లలో పిల్లలకు ఐరన్ సిరప్ వేయడం లేదనే చర్చ జరుగుతోంది. ఈ విషయంపై జిల్లాస్థాయి అధికారులకు సమాచారం ఇచ్చినా పట్టించుకోవడం లేదని పలువురు అంగన్వాడీ టీచర్లు తెలిపారు. వారానికి 2 సార్లు వేయాలని, ఐరన్ సిరప్‌ల స్టాక్ లేదని ANM, ఆశా వర్కర్లు చెబుతున్నారు. ఈ విషయంపై DMHO దేవిని సంప్రదించగా.. పిల్లలకు సరిపడా స్టాక్ అందుబాటులో ఉందని స్పష్టం చేశారు.
News February 6, 2026
అవార్డు అందుకున్న తాడిపత్రి బుడ్డోడు

తాడిపత్రికి చెందిన 2వ తరగతి చదువుతున్న 7 ఏళ్ల బుడతడు సీహెచ్ 126.. సర్ సివీ రామన్ యంగ్ జీనియస్ అవార్డుకు ఎంపికయ్యాడు. ఇటీవల ఒలింపియాడ్ పరీక్షలలో సత్తాచాటి 3వ స్థానంలో నిలిచాడు. హైదరాబాదులో నిర్వహించిన కార్యక్రమంలో హీరో శ్రీకాంత్, ఎమ్మెల్యేలు గంటా శ్రీనివాస్, చింతమనేని ప్రభాకర్ చేతుల మీదుగా 33వ సర్ సివీ రామన్ యంగ్ జీనియస్ అవార్డు అందుకున్నారు.


