News November 27, 2025
అనంత: స్కూల్ బస్సుల ఫిట్నెస్‌పై తనిఖీ చేయనున్న అఫీసర్

ఈనెల 28 నుంచి డిసెంబర్ 4 వరకు జిల్లాలో అన్ని స్కూలు బస్సులను తనిఖీ చేయడం జరుగుతుందని ఉప రవాణా కమిషనర్ ఎం. వీర్రాజు తెలిపారు. అనంతపురం జిల్లా రవాణా శాఖ అధికారులు కూడా స్కూల్ బస్సులపై ప్రత్యేకంగా ఉంచాలన్నారు. అగ్నిమాపక పరికరాలు, ఎమర్జెన్సీ ఎగ్జిట్, స్పీడ్ గవర్నర్లు వాటి పనితీరు పట్ల సమగ్రంగా తనిఖీ చేయనున్నట్లు ఆయన తెలిపారు. ఇప్పటికే అన్ని విద్యాసంస్థల యాజమాన్యాలకు నోటీసులు పంపించామన్నారు.
Similar News
News February 15, 2026
కాల్ సెంటర్ 1100 సేవలను వినియోగించుకోండి: కలెక్టర్

జిల్లా ప్రజలు తమ ఫిర్యాదుల పరిష్కారం కోసం కాల్ సెంటర్ 1100 సేవలను వినియోగించుకోవాలని కలెక్టర్ ఆనంద్ సూచించారు. పెండింగ్‌లో ఉన్న అర్జీల స్థితి తెలుసుకోవడానికి 1100కు కాల్ చేయవచ్చని తెలిపారు. ఈనెల 16న అనంతపురం కలెక్టరేట్ రెవెన్యూ భవనంలో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 1 వరకు ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్) నిర్వహించబడుతుందన్నారు. అర్జీదారులు అవసరమైన పత్రాలతో హాజరై సమస్యలు పరిష్కరించుకోవాలన్నారు.
News February 14, 2026
ముచ్చటగా మూడోసారి..

ఏపీ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ముచ్చటగా మూడోసారి బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఇప్పటికే ఒటాన్ అకౌంట్, పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆయన 2026-27 ఆర్థిక సంవత్సరానికి శనివారం ఉదయం 11:15 గంటలకు అసెంబ్లీలో సమగ్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. అభివృద్ధి-సంక్షేమానికి సమతూకం కల్పించేలా రూపకల్పన చేసినట్లు సమాచారం. సీఎం మార్గనిర్దేశంతో, పది రోజుల ప్రీ-బడ్జెట్ సమావేశాల అనంతరం ఈ బడ్జెట్ సిద్ధమైంది.
News February 14, 2026
అనంతపురం జిల్లాకు బడ్జెట్ కేటాయింపులపై ఉత్కంఠ

ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ శనివారం శాసనసభలో రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆయన రెండోసారి పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెడుతుండటం విశేషం. జిల్లాకు చెందిన మంత్రి కావడంతో ఉమ్మడి అనంతపురం జిల్లాకు కీలక ప్రాజెక్టులు, నిధుల కేటాయింపులపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.


