News February 22, 2025

అనంత: హైవేపై రోడ్డు ప్రమాదం

image

పెద్దవడుగూరు మండలం కాసేపల్లి టోల్ ప్లాజా సమీపంలో 44 హైవేపై శనివారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. ముందు వెళ్తున్న బొలెరో వాహనాన్ని వెనుక వైపు నుంచి ప్రైవేట్ వోల్వో బస్సు ఢీకొంది. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్‌కు గాయాలయ్యాయి. బస్సు హైదరాబాదు నుంచి బెంగళూరుకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. బస్సులో ఉన్న ప్రయాణికులకు ఎటువంటి గాయాలు కాలేదు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Similar News

News February 28, 2026

కొన్నిసార్లు మిలిటరీ యాక్షన్ తప్పదు.. ఇరాన్‌పై ట్రంప్

image

ఇరాన్‌తో జరుగుతున్న చర్చల పట్ల ట్రంప్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. తమ డిమాండ్లకు ఇరాన్ అంగీకరించడం లేదంటూ పెదవి విరిచారు. ఇరాన్ వద్ద అణు ఆయుధాలు ఉండొద్దన్నదే తమ లక్ష్యమన్నారు. అయితే వారు చిత్తశుద్ధితో చర్చలు జరపడం లేదని విమర్శించారు. తాము మిలిటరీని వాడొద్దనే అనుకుంటున్నామని, కానీ కొన్నిసార్లు తప్పకపోవచ్చని వ్యాఖ్యానించారు. సైనిక చర్య వల్ల మిడిల్‌ఈస్ట్‌లో ఉద్రిక్తతలను కొట్టిపారేయలేమన్నారు.

News February 28, 2026

ఉచిత రేషన్.. కేంద్రం కీలక నిర్ణయం

image

ఉచిత రేషన్ కింద ఇచ్చే బియ్యాన్ని ఫోర్టిఫికేషన్‌ చేసే ప్రాసెస్‌ను కేంద్రం తాత్కాలికంగా నిలిపివేసింది. బియ్యాన్ని ఎక్కువ కాలం స్టోర్ చేసినప్పుడు అందులోని పోషక విలువలు తగ్గిపోతున్నట్లు IIT ఖరగ్‌పూర్ స్టడీలో తేలడమే దీనికి కారణం. మరింత మెరుగైన పద్ధతిలో పోషకాలను అందించే విధానాన్ని గుర్తించే వరకు ఈ ప్రాసెస్‌ను ఆపాలని నిర్ణయించారు. అయితే రేషన్ కోటాలో మాత్రం ఎలాంటి తగ్గింపు ఉండదని కేంద్రం స్పష్టం చేసింది.

News February 28, 2026

కివీస్ ఓటమి.. పాక్‌కు దక్కిన లైఫ్ లైన్!

image

ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓటమితో న్యూజిలాండ్ తన సెమీఫైనల్ బెర్తును ప్రమాదంలో పడేసుకుంది. ఈ మ్యాచ్ గెలిచి ఉంటే ఎటువంటి లెక్కలతో పని లేకుండా నేరుగా సెమీస్‌కు వెళ్లేవాళ్లమని, మా పని సులువు అయ్యేదని కివీస్ కెప్టెన్ మిచెల్ శాంట్నర్ ఆవేదన వ్యక్తం చేశారు. బ్యాటింగ్‌లో విఫలమయ్యామని అంగీకరించారు. కివీస్ ఓటమి పాక్‌కు కలిసొచ్చింది. నేడు శ్రీలంకపై భారీ తేడాతో గెలిస్తే సెమీస్‌లోకి దూసుకెళ్లే ఛాన్స్ ఉంది.