News March 23, 2024

అనంత: JNTU బీఫార్మసీ ఫలితాలు విడుదల

image

అనంతపురం JNTU బీఫార్మసీ ఫలితాలను విడుదల చేసినట్లు డైరెక్టర్‌ ఎవాల్యుయేషన్‌ కేశవరెడ్డి, సీఈ చంద్రమోహన్‌రెడ్డి తెలిపారు. ఫిబ్రవరిలో బీఫార్మసీ తృతీయ సంవత్సరం ప్రథమ సెమిస్టర్‌ (ఆర్‌19)రెగ్యులర్‌, సప్లమెంటరీతో పాటు(ఆర్‌15) సప్లమెంటరీ పరీక్షలు జరిగాయన్నారు. అదేవిధంగా ద్వితీయ సెమిస్టర్‌(ఆర్‌19,15) సప్లిమెంటరీ పరీక్షలు జరిగాయన్నారు. విద్యార్థులు ఆ ఫలితాల కోసం www.jntua.ac.in వెబ్‌సైట్ సంప్రదించాలన్నారు.

Similar News

News April 20, 2025

ATP: చెత్త సంపద తయారీ కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్

image

అనంతపురం జిల్లా రూరల్ మండలంలోని ఆకుతోటపల్లి గ్రామంలోని చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాన్ని శనివారం జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. గ్రామ సమీపంలోని జాతీయ రహదారిలో ఈ-వేస్ట్ కలెక్షన్ కౌంటర్, చలివేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ప్రారంభించారు. ఈ-వేస్ట్ ప్రత్యేక నిర్మూలన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. అనంతరం మండల పరిషత్ ఆదర్శ ప్రాథమిక పాఠశాలలో మరుగుదొడ్లను పరిశీలించారు.

News April 19, 2025

ATP:వసతి గృహాల విద్యార్థుల ప్రతిభ గర్వకారణం: కలెక్టర్

image

ఇంటర్‌లో సాంఘిక సంక్షేమ వసతి గృహాల విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబరచడం గర్వకారణమని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ అన్నారు. సాంఘిక సంక్షేమ వసతి గృహాల విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబరచి 900కు పైగా మార్కులు సాధించడం గర్వకారణమని పేర్కొన్నారు. శనివారం అనంతపురం కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్ హాల్‌లో విద్యార్థులతో సమావేశం నిర్వహించి ఆయన మాట్లాడారు.

News April 19, 2025

ప్రభుత్వ భవనాల మరమ్మతులకు ప్రతిపాదనలు పంపండి: కలెక్టర్

image

గిరిజన కుటుంబాలకు రూఫ్ టాప్ కింద సోలార్‌తో విద్యుత్ ఉత్పత్తికి చర్యలు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ అధికారులకు సూచించారు. వారికి ఆయుష్మాన్ భారత్ కార్డులు పెండింగ్ లేకుండా పంపిణీ చేయాలన్నారు. ప్రధాన మంత్రి ఉజ్వల్ యోజన పథకం కింద అర్హతలతో గుర్తించబడిన వారికి గ్యాస్ కనెక్షన్ మంజూరు చేయాలని ఆదేశించారు. అసంపూర్తిగా ఉన్న అంగన్వాడీ, ప్రభుత్వ పాఠశాల భవనాలకు మరమ్మతులకు ప్రతిపాదనలు పంపాలన్నారు.

error: Content is protected !!