News August 21, 2025
అనకాపల్లిలో అవగాహన సదస్సులు నిర్వహించాలి: కలెక్టర్

కౌమార దశలో వివాహాలు జరగకుండా అవగాహన సదస్సులు నిర్వహించాలని కలెక్టర్ విజయకృష్ణన్ సూచించారు. బుధవారం అనకాపల్లి కలెక్టరేట్లో జిల్లాస్థాయి బాలల సంక్షేమ, రక్షణ కమిటీ సమావేశం నిర్వహించారు. జిల్లా, మండల, గ్రామస్థాయిలో సంక్షేమ రక్షణ కమిటీలు ఏర్పాటు చేయాలన్నారు. బాల్యవివాహాలు, బాలలపై లైంగిక వేధింపులు, బాలల అక్రమ రవాణా జరగకుండా చర్యలు చేపట్టాలన్నారు. బాలలతో భిక్షాటన చేయించకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.
Similar News
News April 14, 2026
జగిత్యాల: భవన నిర్మాణ కూలీగా ప్రభుత్వ టీచర్

11 ఏళ్లు వీఆర్‌ఏగా పనిచేసిన JGTL(D) కొడిమ్యాల (M) చెప్యాలకు చెందిన లక్ష్మీరాజం, ఉపాధ్యాయుడిగా ఎంపికై ఎనిమిది నెలలకే ఆ కొలువు కోల్పోయారు. ఆర్‌సీఐ వెరిఫికేషన్ సమస్యతో అధికారులు ఆయన్ను తొలగించడంతో, ప్రస్తుతం కుటుంబ పోషణకు భవన నిర్మాణ పనులకు వెళ్తున్నారు. అటు పాత ఉద్యోగం లేక, ఇటు టీచర్ కొలువు పోయి రోడ్డున పడ్డానని, తనకు న్యాయం చేయాలని ఆయన సోమవారం ప్రజావాణిలో కలెక్టర్‌ను వేడుకున్నారు.
News April 14, 2026
ఇంటర్ ఫలితాలు.. 13 మంది ఆత్మహత్య

తెలంగాణ ఇంటర్ ఫలితాల నేపథ్యంలో విద్యార్థుల బలవన్మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఇప్పటివరకు రాష్ట్రంలో 13 మంది ఆత్మహత్య చేసుకున్నారు. వీరిలో ఏడుగురు అమ్మాయిలు, ఆరుగురు అబ్బాయిలు ఉన్నారు. సంగారెడ్డి, నిర్మల్ జిల్లాల్లో ఇద్దరు.. సిద్దిపేట, HYD, మేడ్చల్, రంగారెడ్డి, ఆదిలాబాద్, మెదక్, MBNR, సూర్యాపేట, ఖమ్మం జిల్లాల్లో ఒక్కో విద్యార్థి సూసైడ్ చేసుకున్నారు.
News April 14, 2026
చిత్తూరు: ఈ ప్రాంతాలలో కోళ్ల రవాణా నిషేధం

సదుం మండలంలోని పుట్టవారి పల్లి, అమ్మగారిపల్లి, కంభంవారి పల్లి, కార్వేటి నగరం మండలంలోని RKVB పేట నుంచి కోళ్ల రవాణా నిషేధిస్తూ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. ఫిబ్రవరిలో ఈ ప్రాంతాలలో కోళ్లకు బర్డ్ ప్లూ సోకిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రెండు నెలలపాటు ఈ ప్రాంతాలలో నమూనాలు తీసి టెస్టింగ్‌కు పంపనున్నారు. అన్నింటిలో నెగటివ్ వస్తేనే కోళ్ల పెంపకానికి అనుమతించనున్నారు.


