News December 14, 2025

అనకాపల్లిలో ఈనెల 17న మెగా జాబ్ మేళా

image

అనకాపల్లి జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఈనెల 17వ తేదీన అనకాపల్లి ఆదినారాయణ మహిళా కళాశాలలో మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్లు సంస్థ జిల్లా అధికారి గోవిందరావు తెలిపారు. పది, ఇంటర్, ఐటీఐ, డిగ్రీ, పాలిటెక్నిక్, పీజీ చేసి 18-40 ఏళ్ల లోపు వయసు ఉన్నవారు అర్హులుగా పేర్కొన్నారు. ఆసక్తి గలవారు naipunyam.ap.gov.in వెబ్ సైట్‌లో వివరాలు నమోదు చేసుకోవాలన్నారు. 52 కంపెనీలు జాబ్ మేళాలో పాల్గొంటాయన్నారు.

Similar News

News December 24, 2025

నూతన పెన్షన్లపై అనంతపురం కలెక్టర్ కీలక ప్రకటన

image

ఎన్టీఆర్ భరోసా పథకం కింద నూతన పెన్షన్ల మంజూరుకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇంకా మార్గదర్శకాలు రావాల్సి ఉందని జిల్లా కలెక్టర్ ఆనంద్ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుతం కేవలం స్పౌజ్ కేటగిరీ కింద భర్త మరణించిన వితంతువులకు మాత్రమే పెన్షన్లు మంజూరు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఇతర కేటగిరీల దరఖాస్తుదారులు మార్గదర్శకాలు వచ్చే వరకు వేచి ఉండాలని కలెక్టర్ జిల్లా ప్రజలకు సూచించారు.

News December 24, 2025

నర్సాపూర్: ప్రేమ విఫలం.. యువకుడి ఆత్మహత్య

image

ప్రేమ విఫలం కావడంతో యువకుడు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన నర్సాపూర్ మండలంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. మండల పరిధిలోని పెద్ద చింతకుంట గ్రామానికి చెందిన వేణు (24) డిగ్రీ పూర్తి చేసి వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. సోమవారం ఇంటి నుంచి వెళ్లి గ్రామ శివారులో చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. బంధువులు ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News December 24, 2025

రేషన్ షాపుల్లో రూ.20కే గోధుమ పిండి

image

AP: రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జనవరి 1 నుంచి రేషన్ షాపుల్లో కిలో గోధుమ పిండిని కేవలం రూ.20కే పంపిణీ చేయనుంది. మార్కెట్‌లో రూ.40 నుంచి రూ.80 వరకు ఉన్న ధరలతో పోలిస్తే ఇది చాలా తక్కువ. తొలుత జిల్లా కేంద్రాలు, ముఖ్యమైన పట్టణాలు, నగరాల్లో ఈ పథకం అమలుకానుంది. ఇందుకోసం పౌరసరఫరాల శాఖ ఏర్పాట్లు చేస్తోంది. డిమాండ్‌ను బట్టి రాష్ట్రవ్యాప్తంగా ప్రతినెలా సరఫరా చేసే యోచనలో ప్రభుత్వం ఉంది.