News March 30, 2025

అనకాపల్లిలో పీజీఆర్ఎస్ రద్దు

image

ఈనెల 31 సోమవారం రంజాన్ పర్వదినం సందర్భంగా ప్రభుత్వ సెలవు ప్రకటించడంతో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ (పీజీఆర్ఎస్) తాత్కాలికంగా రద్దు చేసినట్లు కలెక్టర్ విజయకృష్ణన్ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. అనకాపల్లి జిల్లా కేంద్రంతోపాటు అన్ని మండల కేంద్రాలు, సచివాలయాల్లో సోమవారం పీజీఆర్ఎస్ నిర్వహించబడదన్నారు. జిల్లా ప్రజలంతా గమనించాలని ఆమె కోరారు.

Similar News

News July 9, 2025

మంత్రులకు CM చంద్రబాబు వార్నింగ్!

image

AP: YCP దుష్ప్రచారాలతో పాటు అన్ని విషయాలపై మంత్రులు సకాలంలో స్పందించాలని CM CBN సూచించారు. లేదంటే ఇప్పుడున్న మంత్రుల స్థానంలో కొత్తవారు వస్తారని క్యాబినెట్ భేటీలో హెచ్చరించారు. కాగా మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ బాండ్లలో పెట్టుబడులు పెట్టొద్దని 200 కంపెనీలకు YCP ఈ-మెయిళ్లు పెట్టించినట్లు మంత్రి కేశవ్ CM దృష్టికి తీసుకెళ్లారు. ఈ వ్యవహారంపై ఆగ్రహించిన CM.. YCP కుట్రలపై విచారణకు ఆదేశిస్తామన్నారు.

News July 9, 2025

ఆగస్టు నుంచి కొత్త పట్టాదారు పాసు పుస్తకాలు: మంత్రి అనగాని

image

రైతులకు ఈ ఏడాది ఆగస్టు నుంచి కొత్త పట్టాదారు పాసు పుస్తకాలు ప్రభుత్వం పంపిణీ చేయనున్నట్లు రెవెన్యూ & రిజిస్ట్రేషన్ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ బుధవారం తెలిపారు. సర్వే పూర్తయిన భూ యజమానులకు ఈ పట్టాదారు పాసు పుస్తకాలను పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. మొదటి విడతగా 21.86 లక్షల మందికి ఇవ్వనున్నట్లు తెలిపారు. ప్రతి పాసు పుస్తకంపై క్యూఆర్ కోడ్, రైతు ఆధార్ వివరాలు నమోదు చేస్తామని పేర్కొన్నారు.

News July 9, 2025

నాగార్జునసాగర్ నిండితే వారికి పండుగే..

image

నాగార్జున సాగర్ ఉమ్మడి నల్గొండ జిల్లా రైతుల ఎమోషన్. ఇది నిండిందంటే చాలు వారికి పండుగే. అయితే ఎగువన కురుస్తున్న వర్షాలకు శ్రీశైలం నిండుకుండను తలపిస్తోంది. ఆ ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో నాగార్జునసాగర్‌లో‌కి నీరు వచ్చి చేరుతోంది. దీంతో ఉమ్మడి నల్గొండ జిల్లాలో సాగు పనులు జోరందుకున్నాయి. కాగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో సాగర్ ఆయకట్టు కింద 3.75 లక్షల ఎకరాలు ఉంది.