News August 22, 2024
అనకాపల్లిలో ప్రమాదం.. కాకినాడ జిల్లా వాసి విషాద గాథ ఇదీ

అనకాపల్లిలో బుధవారం జరిగిన అగ్నిప్రమాదంలో సామర్లకోటకు చెందిన నాగబాబు మృతిచెందిన విషయం తెలిసిందే. కాగా 6 నెలల క్రితమే తండ్రి మృతిచెందాడు. తల్లి, సోదరులకు తానున్నానని ధైర్యం చెప్పి ఉద్యోగానికి వెళ్లాడు. ఇప్పుడు అతని మృతితో కుటుంబం కన్నీరుమున్నీరవుతోంది. భార్య సాయితో పాటు పదేళ్ల కుమార్తె, ఎనిమిదేళ్ల కుమారుడు ఉన్నారు. విశాఖలోనే ఉంటూ ఎసెన్షియా కంపెనీలో ప్రొడక్షన్ అసిస్టెంట్ మేనేజర్‌గా పనిచేస్తున్నారు.
Similar News
News February 17, 2026
JEE మెయిన్స్‌లో ‘తిరుమల’ విద్యార్థుల జయకేతనం

JEE MAIN 2026 సెషన్-1 ఫలితాలలో రాజమహేంద్రవరంలోని TIRUMALA IIT & అండ్ మెడికల్ విద్యార్థి డి.శ్రీవేద్ 99.999 పర్సంటైల్ సాధించారు. SC కేటగిరిలో శ్రీవేద్ ఆలిండియా టాపర్‌గా నిలిచారని TIRUMALA విద్యాసంస్థల ఛైర్మన్ నున్న తిరుమలరావు తెలిపారు. అలాగే ఎం.కృష్ణ శరవణ సాకేత్ 99.99, జీ.వాత్సల్యకు 99.98, ఆర్.చరణ్ తేజ 99.98 పర్సంటైల్ సాధించారన్నారు. ఉత్తమ స్కోర్లను సాధించినవారిని ఆయన అభినందించారు.
News February 17, 2026
బీజేపీ పథకాలు ప్రతి గడపకూ చేరాలి: పురందీశ్వరి

తూర్పు గోదావరి జిల్లా BJP కార్యాలయంలో సోమవారం నిర్వహించిన మైనారిటీ, ఎస్సీ మోర్చా సమావేశంలో MP పురందీశ్వరి పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను వివరించారు. ఎస్సీ, మైనారిటీ వర్గాల సాధికారత, ఆర్థిక పురోగతికి మోదీ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ ఫలాలు అందేలా మోర్చా నాయకులు క్షేత్రస్థాయిలో కృషి చేయాలని ఆమె సూచించారు.