News February 14, 2025

అనకాపల్లిలో మాదకద్రవ్యాల నియంత్రణపై వర్క్ షాప్

image

అనకాపల్లిలో మాదక ద్రవ్యాల నియంత్రణపై పోలీస్ అధికారులకు ఒకరోజు వర్క్ షాప్ శుక్రవారం నిర్వహించారు. కస్టమ్స్ ఎక్సైజ్ సర్వీస్ టాక్స్ అప్పిలేట్ ట్రిబ్యునల్ అధికారి రంగధామ్ మాట్లాడుతూ.. చట్టపరమైన అంశాలు దర్యాప్తులో తీసుకోవాల్సిన జాగ్రత్తలను అధికారులకు వివరించారు. అదనపు ఎస్పీ దేవ ప్రసాద్ మాట్లాడుతూ.. అధికారులు సమన్వయంతో పని చేయాలని సూచించారు.

Similar News

News March 12, 2025

తెలంగాణ బడ్జెట్.. భువనగిరి జిల్లాకు ఇవి కావాలి..?

image

అసెంబ్లీ సమావేశాలు నేటి నుంచి ప్రారంభమవుతున్నాయి. ఈ నేపథ్యంలో భువనగిరి జిల్లాలో పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు. చిన్నేటి వాగులపై చెక్ డ్యాంల నిర్మాణం, భువనగిరిలో ఐటీ హబ్, ఇంటిగ్రేటెడ్ స్కూల్స్‌కు నిధులు, భువనగిరి మెడికల్ కళాశాలకు ప్లేస్ కేటాయింపు, రోడ్ల మరమ్మత్తులకు నిధులు కేటాయించాలంటున్నారు. 

News March 12, 2025

పాకిస్థాన్ క్రికెట్ ICUలో ఉంది: అఫ్రీది

image

సరైన నిర్ణయాలు తీసుకోకపోవడం వల్లే పాకిస్థాన్ క్రికెట్ ఇప్పుడు ICUలో ఉందని మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రీది అన్నారు. ‘PCB నిర్ణయాల్లో కంటిన్యుటీ, కన్సిస్టెన్సీ ఉండట్లేదు. తరచుగా కెప్టెన్, కోచ్‌లను మారుస్తున్నారు. కోచ్‌లు ప్లేయర్లను నిందించడం, మేనేజ్‌మెంట్ స్టాఫ్ తమ పదవుల్ని కాపాడుకునేందుకు కోచ్‌లు, ఆటగాళ్లను నిందించడం విచారకరం’ అని బోర్డు పని తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు.

News March 12, 2025

తెలంగాణ బడ్జెట్.. కరీంనగర్‌కు ఏం కావాలంటే..!

image

అసెంబ్లీ సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో కరీంనగర్ జిల్లాలోని పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు. దళిత బంధు రెండో విడత నిధులు విడుదల చేయాలని, వేసవిలో సాగు, తాగునీటి సమస్య లేకుండా చూడాలన్నారు. కల్వల ప్రాజెక్టుకు నిధులు కేటాయించి పూర్తి చేయాలని, అలాగే జిల్లాలో పెండింగ్‌లో ఇతర పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ప్రజలు కోరుకుంటున్నారు.

error: Content is protected !!