News March 22, 2025
అనకాపల్లిలో రెండు లారీలు ఢీ.. ఒకరి మృతి

అనకాపల్లి జిల్లాలో శుక్రవారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కశింకోట మండలం నేషనల్ హైవేపై ఎన్‌జీ పాలెం వద్ద రెండు లారీలు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఓ లారీ డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. మరో డ్రైవర్ క్యాబిన్‌లోనే చిక్కుకున్నాడు. అతికష్టం మీద అతడిని బయటకు తీశారు. క్షతగాత్రుడిని ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసుకున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News March 22, 2025
విశాఖ: పేదరిక నిర్మూలనకు పి-4 దోహదం: కలెక్టర్

రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పి-4 విధానం పేదరిక నిర్మూలనకు దోహదపడుతుందని, అధికారులు దానిపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని జిల్లా కలెక్టర్ హరేంధిర ప్రసాద్ పేర్కొన్నారు. జిల్లాలోని పలు సంఘాల ప్రతినిధులు, అధికారులతో శనివారం కలెక్టరేట్‌లో సమావేశం నిర్వహించారు. పి-4 విధానం ద్వారా పేదరిక నిర్మూలన సాధ్యపడుతుందని, అందరూ దీని ఆవశ్యకతను తెలుసుకొని భాగస్వామ్యం కావాలన్నారు.
News March 22, 2025
విశాఖ: పాత హత్యా కేసును ఛేదించిన నగర పోలీసులు

విశాఖ జిల్లాలో 2021లో కొందరు దొంగలు జి శ్రీను అనే వ్యక్తి మర్మాంగం కోసి రోడ్డుపై హత్య చేశారు. ఈ హత్యపై ఎలాంటి ఆధారాలు లేక అప్పుడు కేసు క్లోజ్ చేశారు. ప్రస్తుతం విశాఖ పోలీసులు క్లోజైన కేసులను ఓపెన్ చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ హత్యను అనకాపల్లికి చెందిన లాలం గణేష్, పెద్ద గంట్యాడకు చెందిన తారకేశ్వరరావు చేసినట్లు గుర్తించారు. దీంతో శనివారం నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపినట్లు తెలిపారు.
News March 22, 2025
విశాఖ: పోలీస్ కమిషనరేట్ పరిధిలో 16 మందికి బదిలీలు

విశాఖ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 16 మందిని బదిలీ చేస్తూ సీపీ శంకబద్ర బాచి ఆదేశాలు జారీ చేశారు. వీరిలో ముగ్గురు ఏఎస్ఐలతో పాటు హెడ్ కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్లు ఉన్నారన్నారు. భీమిలి ఏఎస్ఐ ఎం సింహాచలంను ఆనందపురానికి, సీఎస్‌బి నుంచి చంటి కుమారును ఆరిలోవకు, సీఎస్‌బీ నుంచి శివరామకృష్ణును వన్‌టౌన్‌కు బదిలీ చేశారు.