News December 20, 2025

అనకాపల్లిలో సీఎం చంద్రబాబు పర్యటన వివరాలివే..

image

➤ ఉదయం 11.15కి కశింకోట (M) ఉగ్గినపాలెం హెలీప్యాడ్‌కు చేరుకుంటారు
➤11.30-11.55 వరకు APSR వసతి గృహం విద్యార్థులతో ముచ్చటిస్తారు
➤11.50కి బయ్యవరం సంపద కేంద్రాన్ని సందర్శిస్తారు
➤12.40కి తాళ్లపాలెం ప్రజా వేదిక కార్యక్రమంలో పాల్గొంటారు
➤2.55కి ఉగ్గినపాలెంలో క్యాడర్ సమావేశంలో పాల్గొంటారు
➤సాయంత్రం 4.40కి వాజ్‌పేయి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి హాజరవుతారు
➤5.10కి హెలిప్యాడ్‌లో తిరుగుపయనమవుతారు

Similar News

News February 14, 2026

చిత్తూరు జిల్లా నేతలతో లోకేశ్ సమావేశం

image

చిత్తూరు జిల్లాకు సంబంధించిన MP, MLA లు, MLCలతో మంత్రి లోకేశ్ సమావేశం నిర్వహించారు. ఉండవల్లి నివాసంలో ఆయన ఆత్మీయ సమావేశం నిర్వహించి ప్రజాప్రతినిధుల కుటుంబ సభ్యులను ఆప్యాయంగా పలకరించారు. అదే విధంగా జిల్లా రాజకీయాలపై మంత్రి చర్చించినట్లు సమాచారం.

News February 14, 2026

HYD విశాఖ వెళ్లేవారికి గమనిక.. టైమింగ్ ఛేంజ్

image

సిటీ నుంచి వైజాగ్ వెళ్లే జన్మభూమి ఎక్స్‌ప్రెస్ రైలు వేళల్లో రైల్వే అధికారులు మార్పులు చేశారు. లింగంపల్లి నుంచి విశాఖపట్నం మధ్య ఈ రైలు రెగ్యులర్‌గా నడుస్తోంది. లింగంపల్లి- విశాఖ (12806) ఉ.6:55 గం.కు బయలుదేరి విశాఖకు రాత్రి 7:50కు చేరుకుంటుంది. విశాఖ- లింగంపల్లి (12805) రైలు విశాఖలో 6:20 గం.కు బయలుదేరి లింగంపల్లికి రాత్రి 7:15 గం.కు చేరుకుంటుంది. ఈ మార్పులు రేపటి నుంచి అమలవుతాయి.

News February 14, 2026

స్టైలింగ్ ఇలా మార్చుకోండి

image

చాలామంది అమ్మాయిలు ఫేస్ చేసే సమస్య ఎన్ని దుస్తులున్నా వేసుకోవడానికి ఏవీ లేవనేది వారి బాధ. కొత్త బట్టలు కొనకుండా స్టైలింగ్ కాస్త మారిస్తే మీ వార్డ్‌రోబ్ కొత్తగా కనిపిస్తుంది. ఉన్నవాటినే రంగులూ, డిజైన్ల వారీగా మిక్స్ అండ్ మ్యాచ్ వేసుకోవచ్చు. ట్రెండీ దుస్తులు కాకుండా మీ ఒంటి తీరుకు ఏవి నప్పుతాయో చూసుకోండి. మీకంటూ ఓ స్టైల్ స్టేట్మెంట్ క్రియేట్ చేసుకోండి. అప్పుడే మీరేం వేసినా అందంగా కనిపిస్తారు.