News June 8, 2024

అనకాపల్లిలో 40 ఏళ్ల రికార్డు బ్రేక్ చేసిన బీజేపీ

image

అనకాపల్లి ఎంపీ నియోజకవర్గంలో 40 ఏళ్ల రికార్డును BJP బ్రేక్ చేసింది. 1962లో జరిగిన పునర్విభజనలో అనకాపల్లి ఎంపీ నియోజకవర్గ కేంద్రమయ్యింది. అప్పటినుంచి 2019వ రకు టీడీపీ ఎంపీ పి.అప్పల నరసింహం మెజారిటీ రికార్డుగా ఉండేది. ఆయన సాధించిన 1.74 లక్షల ఓట్ల మెజార్టీని 40 ఏళ్ల తర్వాత బీజేపీ అభ్యర్థి సీఎం రమేష్ అధిగమించారు. వైసీపీ అభ్యర్థి ముత్యాలనాయుడుపై 2.96 లక్షల ఓట్ల మెజార్టీ సాధించి రికార్డు సృష్టించారు.

Similar News

News January 27, 2025

వారిని విడిచి పెట్టేది లేదు: మంత్రి లోకేశ్

image

చట్టాలను ఉల్లంఘించే వారిని ఎట్టి పరిస్థితుల్లో విడిచి పెట్టేది లేదని మంత్రి నారా లోకేశ్ ప్రకటించారు. సోమవారం ఓ కోర్టు కేసుకు సంబంధించి హాజరైన ఆయన అనంతరం విలేకరులతో మాట్లాడారు. రెడ్ బుక్కును చూసి ప్రతిపక్షాలు ఆందోళన చెందుతున్నాయని అన్నారు. అయితే టీడీపీ నాయకులు, కార్యకర్తలతో పాటు చట్టాలను ఉల్లంఘించే ఎవరినీ వదిలిపెట్టబోమని అన్నారు. ఈ సమావేశంలో ఎంపీ శ్రీభరత్ తదితరులు పాల్గొన్నారు.

News January 27, 2025

విశాఖలో పర్యాటకశాఖ పెట్టుబడుల సదస్సు 

image

విశాఖలోని నోవాటెల్ హోటల్‌లో పర్యాటక పెట్టుబడిదారుల ప్రాంతీయ సదస్సు సోమవారం ప్రారంభమైంది. రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేశ్, స్పీకర్ అయ్యన్నపాత్రుడు, టూరిజం కార్పొరేషన్ ఛైర్మన్ బాలాజీ, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్, పర్యాటక శాఖ ఎండీ ఆమ్రపాలి పాల్గొన్నారు. ఈ సదస్సులో వ్యాపారవేత్తలతో టూరిజంలో పెట్టుబడులపై చర్చించనున్నారు. 

News January 27, 2025

మీరెఎవ్వరూ స్టీల్ ప్లాంట్ గురించి అడగలే: మంత్రి లోకేశ్

image

విశాఖలో మంత్రి లోకేశ్ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ఈరోజు మీరెవ్వరూ విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి అడగలేదని రిపోర్టర్లను ఎదురు ప్రశ్న వేశారు. విశాఖ వచ్చినప్పుడుల్లా మొన్నటి వరకు విశాఖ స్టీల్ ప్లాంట్ అంటూ ఫస్ట్ మీడియా మిత్రులు బుల్లేట్ దింపేవారని అన్నారు. ఆనాడు చెప్పిన విధంగా ప్రైవేటీకరణ జరగనివ్వమన్న మాటకు కట్టుబడి ఉన్నామని అన్నారు.