News April 9, 2025
అనకాపల్లిలో 95% మూల్యాంకనం పూర్తి: డీఈవో

అనకాపల్లి జిల్లాలో పదవ తరగతి పరీక్షల పేపర్ల మూల్యాంకన ప్రక్రియ తుదిదశకు చేరినట్లు డీఈవో జి.అప్పారావు నాయుడు తెలిపారు. మంగళవారం అనకాపల్లిలో ఆయన మాట్లాడుతూ.. మూడు కేంద్రాల్లో ఈనెల మూడో తేదీ నుంచి మూల్యాంకన ప్రక్రియ జరుగుతుందన్నారు. జిల్లాకు 1,66,237 జవాబు పత్రాలు వచ్చాయన్నారు. 594 మంది ఉపాధ్యాయులు మూల్యాంకనంలో పాల్గొంటున్నట్లు పేర్కొన్నారు. 95 శాతం మూల్యాంకనం పూర్తయిందన్నారు.
Similar News
News February 17, 2026
పోరాట ఫలితం.. ఏడేళ్ల క్రితం నెరవేరిన ములుగు జిల్లా స్వప్నం!

సరిగ్గా ఏడేళ్ల క్రితం ఇదే రోజున ములుగు జిల్లాగా ఆవిర్భవించింది. తెలంగాణ రాష్ట్ర సాధన పోరాట స్ఫూర్తితో సబ్బండవర్గాలు రణ నినాదం చేశాయి. జర్నలిస్టుల పాదయాత్రతో ఉద్యమం తారస్థాయికి చేరింది. అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ తన పుట్టినరోజు కానుకగా ములుగు జిల్లాను ప్రకటించారు. 2019 ఫిబ్రవరి 17న ములుగు జిల్లా మనుగడలోనికి వచ్చింది. రామప్పకు యునెస్కో గుర్తింపు, మేడారం జాతరతో ములుగు పేరు విశ్వవ్యాప్తమయ్యింది.
News February 17, 2026
పిల్లల్లో మూర్ఛ ఉంటే ఏం చేయాలంటే?

మూర్ఛ వ్యాధి విషయంలో చాలా మంది అలర్ట్గా ఉండట్లేదని నిపుణులు అంటున్నారు. పెద్దవాళ్లతో పోల్చినప్పుడు పిల్లల్లో వచ్చే సీజర్స్‌కు కారణాలూ, చికిత్సకు వారు స్పందించే తీరుతెన్నులూ ఇవన్నీ కాస్త వేరుగా ఉంటాయి. కాబట్టి అప్రమత్తంగా ఉండాలి. చికిత్సను మధ్యలోనే ఆపేయకుండా చివరి వరకు కొనసాగించాలని సూచిస్తున్నారు. అప్పుడే 80-90 శాతం మూర్ఛ రోగులలో ఈ వ్యాధి కంట్రోల్ అవుతుందని చెబుతున్నారు.
News February 17, 2026
పిల్లలకు జ్వరంతో పాటు ఫిట్స్ వస్తుంటే..

ఆరు నెలల నుంచి ఐదేళ్ల వయసున్న పిల్లలో జ్వరంతో పాటు కొందరికి ఫిట్స్ వస్తుంది. రోజులో రెండు, మూడు సార్లు వస్తే మాత్రం సీరియస్గా తీసుకోవాలి. తల్లిదండ్రులకు చిన్నప్పుడు ఫిట్స్ ఉంటే అదీ పిల్లలకు వంశపారపర్యంగా వస్తుంది. జ్వరంతోపాటు తలనొప్పి, వాంతులు, చురుకుగా ఉండకపోవడం, బీపీ తగ్గిన సమయంలో ఫిట్స్ వస్తే మాత్రం సీరియస్గా తీసుకోవాలి. ఇవన్నీ కూడా మెదడువాపు వ్యాధి లక్షణాలు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి.


