News September 22, 2025
అనకాపల్లిలో EVM గిడ్డంగులను తనిఖీ చేసిన కలెక్టర్

అనకాపల్లి SP కార్యాలయం వద్ద ఉన్న EVM గిడ్డంగులను కలెక్టర్ విజయకృష్ణన్ రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో సోమవారం తనిఖీ చేశారు. CC కెమెరాల పనితీరును పరిశీలించారు. ప్రధాన ద్వారానికి ఉన్న సీళ్లను తనిఖీ చేశారు. సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. లాక్ బుక్ నిర్వహణ ఇతర అంశాలపై రాజకీయ నాయకుల ప్రతినిధులతో చర్చించారు. ఈ తనిఖీల్లో RDO షేక్ ఆయిషా పాల్గొన్నారు.
Similar News
News September 22, 2025
మేడ్చల్: ప్రజావాణిలో 95 ఫిర్యాదుల స్వీకరణ

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టరేట్‌లో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదులను అదనపు కలెక్టర్లు విజయేందర్ రెడ్డి, DRO హరిప్రియతో కలిసి రాధికగుప్తా 95 దరఖాస్తులు స్వీకరించారు. ఎంతో వ్యయ, ప్రయాసలకోర్చుకుని వారి సమస్యలను పరిష్కరిస్తామనే నమ్మకంతో ప్రజలు మన వద్దకు వస్తారని, వారి నమ్మకాన్ని నిలబెట్టాల్సిన బాధ్యత అధికారులపై ఉందని అన్నారు.
News September 22, 2025
డీజేలకు అనుమతులు లేవు: ఆదిలాబాద్ ఎస్పీ

దుర్గా నవరాత్రి ఉత్సవాలు, నిమజ్జనంలో డీజేలకు అనుమతులు లేవని ఆదిలాబాద్ ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు.
సుప్రీంకోర్టు నియమ నిబంధనలను లోబడి సౌండ్ బాక్స్‌లను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. రాత్రి సమయాల్లో మహిళలు ఎక్కువగా ఉండే ప్రదేశాల్లో శారదా దేవి మండప కమిటీల వద్ద మహిళా సిబ్బంది, షీ టీం బృందాలతో నిఘా ఏర్పాటు చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. పోలీసు యంత్రాంగం నిరంతరం పెట్రోలింగ్ ఉంటుందన్నారు.
News September 22, 2025
డాక్టర్ల డిమాండ్లను పరిష్కరించాలని కలెక్టర్‌కు వినతిపత్రం

ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పనిచేస్తున్న డాక్టర్ల ప్రధాన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ తూర్పు గోదావరి జిల్లా డాక్టర్ల అసోసియేషన్ సోమవారం కలెక్టర్ చేకూరి కీర్తికి వినతిపత్రం సమర్పించింది. తమ డిమాండ్ల పరిష్కారానికి ప్రభుత్వం ఎలాంటి చొరవ చూపడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. తమ సమస్యలను పరిష్కరించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే గురువారం నుంచి సమ్మెకు దిగుతామని వినతిపత్రంలో హెచ్చరించారు.