News April 14, 2025

అనకాపల్లి: అంబేద్కర్ ప్రపంచ మేధావి: హోంమంత్రి

image

డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ ప్రపంచ మేధావిగా హోంమంత్రి వంగలపూడి అనిత పేర్కొన్నారు. అనకాపల్లి మండలం గుండాల జంక్షన్‌లో నిర్వహించిన అంబేడ్కర్ జయంతి వేడుకల్లో హోం మంత్రి పాల్గొన్నారు. జ్యోతిని వెలిగించి వేడుకలను ప్రారంభించారు. అంబేడ్కర్ ఆశయాలకు అనుగుణంగా ముందుకు వెళుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్, ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ, జేసీ జాహ్నవి పాల్గొన్నారు.

Similar News

News February 26, 2026

HYD: మెగా జాబ్ మేళా

image

నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ విత్ ఇంటెలెక్ట్యువల్ డిసెబిలిటీస్ ఆధ్వర్యంలో యూత్4 జాబ్స్ సాకారంతో దివ్యాంగుల కోసం ప్రత్యేక జాబ్ మేళా నిర్వహించనున్నారు. 27 FEB 2026న సికింద్రాబాద్‌లోని NIEPID క్యాంపస్‌లో ఈ మేళా జరగనుంది. అర్హులైన అభ్యర్థులు తమ బయోడేటా, ఆధార్‌కార్డు, దివ్యాంగ ధ్రువీకరణపత్రం లేదా UDID కార్డు, విద్యార్హత సర్టిఫికేట్లు, పాస్‌పోర్ట్ సైజు ఫొటోలు తీసుకురావాలి.

News February 26, 2026

తీర్థం ఎలా తీసుకోవాలి?

image

తీర్థం స్వీకరించడానికి హస్త గోకర్ణ ముద్రను ఉపయోగించాలి. కుడిచేతి బొటనవేలుతో చూపుడు వేలును నియంత్రించాలి. మిగిలిన 3 వేళ్లను ముందుకు చాచాలి. దీన్నే గోకర్ణ ముద్ర అంటారు. ఇంట్లో పూజ ముగిశాక 3 సార్లు, గుడిలో అయితే ఓసారి తీర్థం తీసుకోవాలి. తీర్థాన్ని శబ్దం రాకుండా, కింద పడకుండా సేవించాలి. ఉపవాసం చేసే వారు ఉదయం, సాయంత్రం తీర్థం తీసుకునేటప్పుడే ఉపవాసం పూర్తయినట్లు లెక్క.

News February 26, 2026

364 అప్రెంటిస్ పోస్టులు.. దరఖాస్తుకు ఎల్లుండే లాస్ట్ డేట్

image

యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్‌లో 364 అప్రెంటిస్ పోస్టులకు అప్లై చేయడానికి ఎల్లుండే ఆఖరు తేదీ. బీఈ, బీటెక్, డిగ్రీ(BA, BCom, BBA, LLB), డిప్లొమా, ఐటీఐ అర్హత గల వారు NATS/NAPS పోర్టల్‌లో అప్లై చేసుకోవచ్చు. వయసు 18 నుంచి 25ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. అకడమిక్ మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://www.uraniumcorp.in