News March 31, 2025

అనకాపల్లి-అచ్యుతాపురం రోడ్డు పనులకు శంకుస్థాపన

image

అనకాపల్లి-అచ్యుతాపురం రహదారి విస్తరణ పనులకు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ సోమవారం సాయంత్రం అచ్యుతాపురం వద్ద శంకుస్థాపన చేశారు. రూ.243 కోట్లతో నాలుగు లైన్ల రహదారితో పాటు ఫ్లైఓవర్ నిర్మాణాన్ని చేపట్టనున్నారు. 13.8 కిలోమీటర్ల పొడవునా నాలుగులైన్ల రహదారిగా విస్తరించనున్నారు. అచ్యుతాపురం మండలం మోసయ్యపేటలో ఫ్లైఓవర్‌ను నిర్మిస్తారు. శంకుస్థాపన అనంతరం మంత్రి లోకేశ్ విశాఖ విమానాశ్రయానికి వెళ్లారు.

Similar News

News July 5, 2025

గ్రేట్.. 5వేల మందికి ఉచితంగా ప్రసవాలు

image

చదువుకోకపోయినా రూపాయి తీసుకోకుండా ఇప్పటివరకూ 5వేల ప్రసవాలు చేశారు రాజస్థాన్‌ అజ్మీర్‌కు చెందిన 80ఏళ్ల సువా దై మా. దాదాపు 50 ఏళ్లుగా 6 గ్రామాల ప్రజలకు ప్రాథమిక వైద్యం అందిస్తున్నారు. తన అనుభవం, జ్ఞానంతో మహిళ నాడిని చెక్ చేసి గర్భధారణను ఆమె నిర్ధారిస్తుంటారు. తుఫానులొచ్చినా, అర్ధరాత్రైనా, కరెంట్ లేకున్నా ప్రసవాలు చేసేందుకు ముందుంటారు. ఆమె డబ్బును తీసుకోకుండా ఆశీర్వాదాలను మాత్రమే అంగీకరిస్తుంటారు.

News July 5, 2025

HYD: ప్రైవేటు బడి పుస్తకాలతో.. భుజం బరువెక్కుతుంది.!

image

HYDలో కొన్ని ప్రైవేటు పాఠశాలల వ్యవహారంతో బడి పుస్తకాలు మోతకోలుగా మారుతున్నాయి. పాఠ్యపుస్తకాలు, నోటు పుస్తకాలు, ప్రాక్టీస్ నోట్స్, సబ్జెక్టు మెటీరియల్ ఇలా రకరకాల పేర్లతో పిల్లల భుజాలకు కిలోల బరువును వేలాడేస్తున్నారు. దీంతో పిల్లల భుజం బరువెక్కుతోంది. సాధారణంగా ప్రభుత్వం పంపిణీ చేసే పాఠ్యపుస్తకాలు, నోట్స్ సరిపోతుంది. మరీ మీ పిల్లల పరిస్థితి ఎలా ఉంది.

News July 5, 2025

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.