News February 3, 2025
అనకాపల్లి: అభివృద్ధి పనులను పరిశీలించిన కలెక్టర్
వీఎంఆర్డీఏ ద్వారా చేపట్టిన అభివృద్ధి పనులను వెంటనే పూర్తి చేయాలని అనకాపల్లి కలెక్టర్ విజయకృష్ణన్ అధికారులను ఆదేశించారు. సోమవారం అనకాపల్లి మండలం సిరసపల్లి, అంతకాపల్లి, బాటజంగాలపపాలెం గ్రామాల్లో వీఎంఆర్డీఏ కమిషనర్ విశ్వనాథన్‌తో కలిసి పర్యటించి అభివృద్ధి పనులను పరిశీలించారు. వారి వెంట సర్వే డిపార్ట్మెంట్ సహాయ సంచాలకులు గోపాలరాజు, ముఖ్య ప్రణాళిక అధికారి శిల్ప, ప్రధాన ఇంజనీర్ భవాని శంకర్ ఉన్నారు.
Similar News
News February 3, 2025
కడప: YVU పీజీ పరీక్షా ఫలితాలు విడుదల
వైవీయూ, అనుబంధ కళాశాలల ఎమ్మెస్సీ, ఎంఏ, ఎంకాం మూడో సెమిస్టర్ పరీక్షలలో విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించారని వీసీ ఆచార్య కె. కృష్ణారెడ్డి అన్నారు. సోమవారం తమ చాంబరులో రిజిస్ట్రార్ ప్రొ పి.పద్మ, సీఈ ప్రొ కెఎస్వీ కృష్ణారావుతో కలిసి పీజీ పరీక్షా ఫలితాలను విడుదల చేశారు. ఫలితాల కోసం https:www.yvuexams.in/results.aspx అనే వెబ్‌సైట్‌ను సందర్శించాలన్నారు. ఏసీఈలు డా.మమత, డా.శ్రీనివాసులు పాల్గొన్నారు.
News February 3, 2025
గ్రూప్-1 ఫలితాల వెల్లడికి లైన్ క్లియర్
TG: గ్రూప్-1 పరీక్ష ఫలితాల విడుదలకు లైన్ క్లియర్ అయింది. నియామకాలపై వివిధ రకాల అభ్యంతరాలతో పలువురు అభ్యర్థులు దాఖలు చేసిన రెండు పిటిషన్లను సుప్రీంకోర్టు కొట్టివేసింది. దీంతో త్వరలోనే గ్రూప్-1 ఫలితాలు విడుదల కానున్నాయి.
News February 3, 2025
ట్రంప్‌తో మోదీ భేటీ.. ఎప్పుడంటే?
PM మోదీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో త్వరలో భేటీ కానున్నట్లు తెలుస్తోంది. ప్రధాని ఈ నెల రెండోవారంలో ఫ్రాన్స్, అమెరికా పర్యటనలకు వెళ్లే అవకాశం ఉంది. ఆ సమయంలోనే ఆయన ఫిబ్రవరి 13న వాషింగ్టన్‌లో ట్రంప్‌తో భేటీ కానున్నట్లు జాతీయ మీడియా పేర్కొంది. మోదీతో సమావేశం నేపథ్యంలో ట్రంప్ డిన్నర్ ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. గత నెల 20న ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే.