News January 25, 2025
అనకాపల్లి: ఆన్‌లైన్ జాబ్ ఆఫర్.. లింక్ క్లిక్ చేస్తే ఇక అంతే

ప్రముఖ సంస్థ పేరుతో ఆన్‌లైన్ జాబ్ ఆఫర్ అంటూ సైబర్ నేరగాళ్లు దోపిడీకి దిగుతున్నారని అనకాపల్లి జిల్లా పోలీసులు పేర్కొన్నారు. జాబ్ ఆఫర్ లెటర్ అంటూ వచ్చే లింక్‌లపై క్లిక్ చేయొద్దని సూచించారు. వ్యక్తిగత, బ్యాంక్ అకౌంట్, పాన్‌కార్డు, ఓటీపీ వివరాలు ఎప్పుడూ అపరిచితులకు షేర్ చేయవద్దు అన్నారు. సైబర్‌క్రైమ్ బాధితులు అయితే 1930 కి కాల్ చేసి ఫిర్యాదు చేయాలన్నారు.
Similar News
News July 4, 2025
KCR లేటెస్ట్ ఫొటోలు

TG: సాధారణ వైద్య పరీక్షల కోసం HYD యశోద ఆస్పత్రిలో చేరిన బీఆర్ఎస్ అధినేత KCRను పలువురు నేతలు పరామర్శించారు. <<16940361>>ఎలాంటి ఇబ్బంది లేకుండా<<>> కుర్చీలో కూర్చున్న మాజీ సీఎం.. కాసేపు నేతలతో మాట్లాడారు. రాష్ట్రంలో నెలకొన్న తాజా పరిస్థితులు, రైతులకు యూరియా, ఎరువుల లభ్యత, వ్యవసాయం, సాగునీరు, ప్రజా సమస్యలపై వారితో చర్చించారు.
News July 4, 2025
ఇన్ని పథకాలు అమలు చేసిన ప్రభుత్వం మాదే: భట్టి

TG: రాజ్యాంగాన్ని కాపాడేందుకు కాంగ్రెస్ పోరాటం చేస్తోందని Dy.CM భట్టి విక్రమార్క అన్నారు. ‘రాజ్యాంగాన్ని మార్చాలని బీజేపీ ప్రయత్నిస్తోంది. మార్చడానికి అది కేవలం ఒక పుస్తకం కాదు. రాజ్యాంగం లేకపోతే ఎవరికీ హక్కులు ఉండేవి కావు’ అని సామాజిక న్యాయ సమరభేరి సభలో వ్యాఖ్యానించారు. రాజ్యాంగ స్ఫూర్తితోనే సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని, ఒక్క ఏడాదిలో ఇన్ని పథకాలు అమలు చేసిన ప్రభుత్వం తమదేనని పేర్కొన్నారు.
News July 4, 2025
ఎస్పీ గారు.. థ్యాంక్యూ: పవన్ కళ్యాణ్

తన పర్యటన సందర్భంగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసి, సామాన్య ప్రజానీకానికి ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకోవడంపై ఎస్పీ దామోదర్‌ను డిప్యూటీ సీఎం పవన్ ప్రత్యేకంగా అభినందించారు. మార్కాపురం పర్యటన అనంతరం హెలిప్యాడ్ వద్ద ఎస్పీని పవన్ ప్రత్యేకంగా షేక్ హ్యాండ్ ఇచ్చి అభినందించారు. అలాగే జిల్లాలో శాంతి భద్రతల స్థితిగతులు సైతం మెరుగ్గా ఉన్నాయని పవన్ చెప్పడం విశేషం.