News November 5, 2025

అనకాపల్లి: ఆలయాల్లో కార్తీక పౌర్ణమి సందడి

image

కార్తీక మాసంలో అత్యంత పవిత్రమైన పుణ్య దినం కార్తీక పౌర్ణమి. బుధవారం కార్తీక పౌర్ణమి పర్వదినం సందర్భంగా అనకాపల్లి జిల్లాలోని అనేక ప్రాంతాలలో ఉన్న శివాలయాలు సందడిగా కనిపించాయి. తెల్లవారుజాము నుంచి భక్తులు ఆలయాలకు వెళ్లి శివయ్యను దర్శించుకుంటున్నారు. కాశీబుగ్గ సంఘటనను దృష్టిలో ఉంచుకొని ఆలయాల నిర్వాహకులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. శివ పంచాక్షరి నామంతో ఆలయాలు
మార్మోగుతున్నాయి.

Similar News

News March 9, 2026

విచారణ జరిపి న్యాయం చేస్తాం: ఎస్పీ

image

ఫిర్యాదుల పరిష్కార వేదికలో వచ్చిన ఫిర్యాదులపై చట్ట ప్రకారం విచారణ జరిపి బాధితులకు న్యాయం చేస్తామని జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. సోమవారం కర్నూలు ఎస్పీ క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో మొత్తం 65 ఫిర్యాదులు స్వీకరించారు. ఉద్యోగాలు ఇప్పిస్తామని మోసం చేయడం, ఆస్తి వివాదాలు, లోన్ మోసాలు, కుటుంబ సమస్యలు వంటి ఫిర్యాదులు వచ్చినట్లు అధికారులు తెలిపారు.

News March 9, 2026

ADB: ఎత్తిపోతలు.. ఉత్తిదేనా?

image

రూ.కోట్లతో నిర్మించిన మినీ ఎత్తిపోతల పథకాలు మరమ్మతులకు నోచుకోకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. చిన్న, పెద్దవాగులపై గత ప్రభుత్వాలు 72 పథకాలను మంజూరు చేశాయి. కాగా ASF జిల్లాలో 14కి 2, ADBలో 27కి 9 మాత్రమే ఉపయోగంలో ఉన్నాయి. NRMLలోనూ ఇదే పరిస్థితి. ప్రభుత్వం రూ.14 కోట్లు విడుదల చేస్తే ఈ లిఫ్టుల మరమ్మతులు పూర్తయి దాదాపు 27 వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందుబాటులోకి రానుందని రైతులు చెబుతున్నారు.

News March 9, 2026

TU: పీజీ పరీక్షలు.. 30 మంది గైర్హాజరు

image

టీయూ పరిధిలోని ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో పీజీ, ఇంటిగ్రేటెడ్ ఫీజు మొదటి, IMBA 7వ సెమిస్టర్ పరీక్షలు సోమవారం ప్రశాంతంగా జరిగినట్లు అకడమిక్ ఆడిట్ సెల్ డైరెక్టర్ ఆచార్య ఘంటా చంద్రశేఖర్ తెలిపారు. మధ్యాహ్నం 4 పరీక్షా కేంద్రాల్లో జరిగిన పరీక్షలకు 529 మంది విద్యార్థులకు 499 మంది హాజరు కాగా 30 మంది గైర్హాజరయ్యారని ఆయన పేర్కొన్నారు. ఎటువంటి మాల్ ప్రాక్టీస్ జరగలేదని తెలిపారు.