News March 13, 2025
అనకాపల్లి: ఇంటర్ పరీక్షకు 586 మంది గైర్హాజరు

అనకాపల్లి జిల్లాలో గురువారం జరిగిన ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షకు 586 మంది విద్యార్థులు గైర్హాజరు అయినట్లు జిల్లా ఇంటర్మీడియట్ అధికారిణి బి.సుజాత ఓ ప్రకటనలో తెలిపారు. జనరల్ విద్యార్థులు 11,419 మంది విద్యార్థులు హాజరు కావలసి ఉండగా 11,083 మంది హాజరైనట్లు తెలిపారు. ఒకేషనల్ విద్యార్థులు 2,364 మంది హాజరు కావలసి ఉండగా 2,114 మంది హాజరైనట్లు తెలిపారు.
Similar News
News March 13, 2025
కరీంనగర్: హోలీ పండుగను ప్రశాంతంగా జరుపుకోవాలి: సిపి గౌస్ ఆలం

శుక్రవారం జరుపుకోనున్న హోలీ పండుగను సురక్షితంగా, బాధ్యతతో జరుపుకోవాలని కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం సూచించారు. బలవంతంగా ఇతరులపై రంగులు వేయవద్దని, ఘర్షణ వాతావరణంలో పండగను జరుపుకోవద్దని తెలిపారు. మద్యం సేవించి వాహనం నడపడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని, కాబట్టి హోలీ పండుగను రంగుల మయంగా ఆనందకరంగా జరుపుకోవాలని అన్నారు. స్నానానికి ప్రమాదకరమైన నీటిలో దిగవద్దని తెలిపారు.
News March 13, 2025
ఉద్యోగుల మధ్య జీతాల తేడాలొద్దు: నారాయణ మూర్తి

ఉద్యోగుల మధ్య జీతాల తేడా ఉండకూడదని, వారిని మనుషుల్లాగా చూడాలని ఇన్ఫోసిస్ ఫౌండర్ నారాయణమూర్తి అన్నారు. తక్కువ, ఎక్కువ వేతన వ్యత్యాసాన్ని తగ్గించాల్సిన అవసరం ఉందని ‘టై కాన్ ముంబై 2025’ ఈవెంట్‌లో అభిప్రాయపడ్డారు. ‘ప్రతి ఉద్యోగి గౌరవం, హుందాతనాన్ని కాపాడాలి. వారిని ప్రశంసించేటప్పుడు బహిరంగంగా, మందలించేటప్పుడు ఏకాంతంగా చెప్పాలి. కంపెనీ లాభాలను ఉద్యోగులందరికీ సమానంగా అందించాలి’ అని పేర్కొన్నారు.
News March 13, 2025
నలుగురు నల్గొండకు చెందినవారే..!

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎన్నిక ఏకగ్రీవం అయ్యింది. ఎమ్మెల్సీలుగా విజయశాంతి, అద్దంకి దయాకర్, శంకర్ నాయక్, నెల్లికంటి సత్యం, దాసోజు శ్రవణ్ నామినేషన్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఎమ్మెల్సీలుగా ఎంపికైన ఐదుగురిలో విజయశాంతి తప్ప మిగతా నలుగురు నల్గొండ జిల్లాకు చెందిన వారే కావడం విశేషం.