News March 4, 2025
అనకాపల్లి: ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షకు 540 మంది గైర్హాజరు

అనకాపల్లి జిల్లాలో మంగళవారం జరిగిన ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలను 540 మంది విద్యార్థులు రాయలేదని కలెక్టర్ విజయ్ కృష్ణన్ తెలిపారు. జనరల్, వొకేషనల్ విభాగంలో మొత్తం 14,249 మంది విద్యార్థులకు గాను 13,709 మంది పరీక్షలకు హాజరైనట్లు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ఎక్కడా అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోలేదని కలెక్టర్ తెలిపారు.
Similar News
News March 4, 2025
మన్యం జిల్లా డీఆర్డీఏ పీడీగా సుధారాణి

పార్వతీపురం మన్యం జిల్లా డీఆర్డీఏ పీడీగా సుధారాణి నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఆమె బాధ్యతలు చేపట్టారు. అనంతరం కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లాలో గ్రామీణ అభివృద్ధికి కృషి చేయాలని కలెక్టర్ ఆమెకు సూచించారు. డీఆర్డీఏ పరిధిలోని సమస్యలు గుర్తించి.. వాటిని పరిష్కరించేలా అడుగులు వేయాలన్నారు.
News March 4, 2025
BREAKING: భువనగిరిలో రోడ్డెక్కిన మహిళలు

భువనగిరి మండలం హనుమాపురంలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని మహిళలు ఆరోపించారు. భువనగిరి-జగదేపూర్ ప్రధాన రహదారిలోని హనుమపురం చౌరస్తా వద్ద మహిళలు బిందెలు పట్టుకొని రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. తమ సమస్యలను పట్టించుకోవాలని కోరారు. మహిళలు రోడ్డుపై బైఠాయించడంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. అధికారులు తాగునీటి ఎద్దడి తీవ్రతను అరికట్టలేకపోతున్నారని వారు మండిపడ్డారు.
News March 4, 2025
జీడిమెట్ల సీఐకి స్మార్ట్ పోలీసింగ్‌లో స్పెషల్ జ్యూరీ అవార్డు

ఢిల్లీ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్మార్ట్ పోలీసింగ్ అవార్డుకు తెలంగాణ నుంచి స్పెషల్ జ్యూరీ అవార్డును సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని జీడిమెట్ల CI మల్లేశ్ అందుకున్నారు. దేశవ్యాప్తంగా 129 రాష్ట్రాల పోలీస్ విభాగాలతో పాటు సెంట్రల్ పోలీస్ ఫోర్స్ నుంచి కూడా పోటీపడ్డారు. అనంతరం తెలంగాణ డీజీపీకి శుభాకాంక్షలు తెలిపారు.