News November 8, 2025

అనకాపల్లి: ఈనెల 10 నుంచి జిల్లా స్థాయి యువజనోత్సవాలు

image

జిల్లాస్థాయి యువజనోత్సవాలను ఈనెల 10వ తేదీ నుంచి నిర్వహించనున్నట్లు కలెక్టర్ విజయ కృష్ణన్ తెలిపారు. ఈ మేరకు కలెక్టరేట్‌లో శుక్రవారం సాయంత్రం గోడపత్రికను ఆవిష్కరించారు. అనకాపల్లిలో 10వ తేదీన 15-29 ఏళ్లలోపు యువ కళాకారులకు 7 విభాగాల్లో పోటీలు జరుగుతాయన్నారు. ఈ పోటీల్లో ప్రతిభ కనబరిచిన వారు రాష్ట్రస్థాయికి ఎంపిక అవుతారన్నారు. ఈ కార్యక్రమంలో సెట్విస్ సీఈవో కవిత పాల్గొన్నారు.

Similar News

News November 8, 2025

HYD: పార్కు కాదు.. పచ్చని డంపింగ్ యార్డు

image

డంపింగ్‌ యార్డ్‌ అనగానే చెత్త, చెదారంతో నిండిన దుర్వాసన గూడు గుర్తుకువస్తుంది. కానీ HYD శివారు పీర్జాదిగూడ బల్దియా పర్వతాపూర్‌ డంపింగ్‌ యార్డ్‌ ఆ అభిప్రాయాన్ని తలకిందులు చేస్తోంది. చెత్త మాయమై, పచ్చదనం పరచుకుంది. పచ్చిక బయళ్లు, ఓపెన్‌ జిమ్‌లు అలరారుతున్నాయి. ‘ఇది డంపింగ్‌ యార్డా? లేక పార్కా?’ అనే అనుమానం కలిగిస్తోంది.

News November 8, 2025

బైక్ కొనాలనుకుంటున్నారా?.. ఇవి తెలుసుకోండి!

image

రోడ్డు భద్రతను మెరుగుపరిచే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం 2026 జనవరి నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి తీసుకురానుంది. 2026 నుంచి కొనుగోలు చేసే టూవీలర్లకు ఇంజిన్ పరిమాణంతో సంబంధం లేకుండా యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ (ABS) ఉండాల్సి ఉంటుంది. అలాగే డీలర్‌లు వాహనాన్ని కొనుగోలు చేసేవారికి 2 BIS సర్టిఫైడ్ హెల్మెట్స్ అందించాలి. రైడర్ & పిలియన్ హెల్మెట్ ధరించాలి. లేకపోతే రూ.వేలల్లో ఫైన్స్ విధించొచ్చు.

News November 8, 2025

బండి సంజయ్‌పై ఈసీకి కాంగ్రెస్ ఫిర్యాదు

image

కరీంనగర్ ఎంపీ, కేంద్రమంత్రి బండి సంజయ్‌పై కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సంఘానికి (ఈసీ) ఫిర్యాదు చేసింది. జూబ్లీహిల్స్ ఉపఎన్నికల ప్రచారంలో ఆయన సీఎం రేవంత్ రెడ్డిని ‘దొంగ’ అని సంబోధించడంపై పీసీసీ ఎన్నికల కో కమిటీ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఆయనపై తక్షణమే చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ కోరింది. కాంగ్రెస్ గెలిస్తే ఉన్న బంగారం కూడా తీసుకెళ్తారని బండి సంజయ్ జూబ్లిహిల్స్ ప్రచారంలో పేర్కొన్నారు.