News December 28, 2025
అనకాపల్లి: ఈనెల 30న జడ్పీ సర్వసభ్య సమావేశం

ఉమ్మడి విశాఖ జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం ఈనెల 30న నిర్వహించనున్నట్లు జడ్పీ సీఈవో నారాయణమూర్తి తెలిపారు. జడ్పీ ఛైర్‌పర్సన్ సుభద్ర అధ్యక్షతన ఉదయం 10:30 గంటలకు విశాఖ జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జరుగుతుందన్నారు. ఉమ్మడి విశాఖ జిల్లాలో అన్ని శాఖల అధికారులు పూర్తి నివేదికలతో సమావేశానికి హాజరు కావాలని కోరారు.
Similar News
News December 28, 2025
పల్నాడు: విషాదం.. ప్రమాదంలో డెలివరీ బాయ్ స్పాట్ డెడ్

నాదెండ్ల మండలంలోని సాతులూరు వద్ద శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు దుర్మరణం చెందాడు. నరసరావుపేట నుంచి పొనుగుపాడుకు కొరియర్ డెలివరీ ఇచ్చి బైక్‌పై తిరిగి వస్తుండగా, కిషోర్‌ను కారు ఢీకొట్టింది. ప్రమాదానికి కారణమైన కారు పిడుగురాళ్లలోని ఓ కంపెనీకి చెందినదిగా పోలీసులు గుర్తించారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
News December 28, 2025
అనంత: భారీగా పెరిగిన చికెన్ ధరలు

అనంతపురం జిల్లాలో ఆదివారం చికెన్ ధరలు భారీగా పెరిగాయి. గుత్తి పట్టణంలో కేజీ చికెన్ రూ.240, స్కిన్ లెస్ రూ.260. అనంతపురంలో రూ.220, స్కిన్ లెస్ రూ.260. గుంతకల్లులో రూ.220, స్కిన్లెస్ రూ.240గా విక్రయిస్తున్నట్లు చికెన్ షాప్ నిర్వాహకులు షఫీ తెలిపారు. కేజీ మటన్ రూ.750లో ఎలాంటి మార్పు లేదన్నారు. ఒక్కసారి ఇలా చికెన్ ధరలు పెరగడంతో మాంసం ప్రియులు అయోమయంలో పడ్డారు.
News December 28, 2025
ఎయిర్‌పోర్ట్ భూముల కబ్జా.. ఏఏఐ అధికారులు సీరియస్

మామునూరు ఎయిర్‌పోర్ట్ భూసేకరణ చివరి దశకు వచ్చినా, ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఏఏఐ)కు చెందిన 706 ఎకరాల్లో 9.86 ఎకరాలు కబ్జా అయింది. ఖిలా వరంగల్ మండలం తిమ్మాపూర్ శివారు ఓ సర్వే నంబర్‌లో ఏఏఐకి చెందిన బెస్త చెరువు కాలనీ పరిసరాల్లోనే 9.86 ఎకరాల భూమిలో ఇళ్ల నిర్మాణాలు ఉండడంతో విస్తుపోయిన ఏఏఐ HYD విభాగం జనరల్ మేనేజర్ నటరాజు, డైరెక్టర్ వీవీ రావు రెవెన్యూ అధికారులను అడిగినట్లు తెలిసింది.


