News February 20, 2026

అనకాపల్లి: ఉద్యోగుల గ్రీవెన్స్‌కు 16 అర్జీలు

image

అనకాపల్లి కలెక్టరేట్‌లో ఉద్యోగుల సమస్యలపై శుక్రవారం గ్రీవెన్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జాయింట్ కలెక్టర్ సౌర్యమాన్ పటేల్ ఉద్యోగం నుంచి అర్జీలను స్వీకరించి వాటిని పరిశీలించారు. ఉద్యోగుల వ్యక్తిగత సమస్యల పరిష్కారం కోసం ప్రతి నెల 3వ శుక్రవారం గ్రీవెన్స్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పరిష్కారానికి అవకాశం గల ప్రతి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.

Similar News

News February 20, 2026

జగిత్యాల: ఉపాధి అవకాశాల కోసం దరఖాస్తుల ఆహ్వానం

image

మైనార్టీ ఈ స్వయం ఉపాధి పథకాల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి ఆర్ఎస్ చిత్రు తెలిపారు. తుర్క కాశి ముస్లిం వర్గానికి టూల్ కిట్లు, జనరేటర్ల పంపిణీ, మైనార్టీ యువతకు ఈ- స్కూటర్ల పంపిణీ పథకానికి ఈనెల 20 నుంచి మార్చి 1 వరకు ఆన్లైన్ లో దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు పేర్కొన్నారు. దరఖాస్తులను ఆయా ఎంపీడీవో, మున్సిపల్ కార్యాలయంలో అందజేయాలని పేర్కొన్నారు.

News February 20, 2026

కాళ్ల: కిసాన్ మోర్చా జిల్లా ఉపాధ్యక్షుడిగా కాశీ

image

బీజేపీ కిసాన్ మోర్చా జిల్లా ఉపాధ్యక్షుడిగా సుంకర కాశీవిశ్వేశ్వరరావు నియామకమయ్యారు. శుక్రవారం ఆయనకు నియామకపత్రంను జిల్లా నాయకులు అందించారు. బీజేపీ సిద్ధాంతాలు, ఆశయాలను గౌరవిస్తూ తాను చేసిన సేవలను గుర్తించి జిల్లా అధ్యక్షుడు వెంకట సూర్యనారాయణ రాజు నియామక పత్రాన్ని అందజేశారని కాశీ తెలిపారు. బీజేపీ జిల్లా అధ్యక్షురాలు ఐ. శ్రీదేవి, ఉపాధ్యక్షుడు కోరా రామ్మూర్తి, తదితరులు అభినందించారు.

News February 20, 2026

ట్రంప్ మాకు వద్దు బాబోయ్: భారతీయ అమెరికన్లు

image

ట్రంప్ పాలనపై భారతీయ అమెరికన్లు అసంతృప్తితో ఉన్నట్లు ఇండియన్ అమెరికన్ యాటిట్యూడ్స్ సర్వే (IAAS) వెల్లడించింది. సర్వేలో పాల్గొన్న వారిలో 71% మంది వ్యతిరేకంగా, 29% మంది సానుకూలంగా ఉన్నట్లు తెలిపింది. ఇమిగ్రేషన్, దేశ ఆర్థిక వ్యవస్థ, ట్రేడ్, టారిఫ్స్ విషయంలో ట్రంప్ పాలసీలను 65% మందికిపైగా వ్యతిరేకించారు. భారతీయులపై విద్వేషం, భారత్‌తో బంధం సడలడం వంటి కారణాలతో అభిప్రాయం మారినట్లు తెలుస్తోంది.