News November 21, 2025

అనకాపల్లి ఉద్యోగుల సమస్యలు పరిష్కారానికి గ్రీవెన్స్

image

అనకాపల్లి కలెక్టరేట్ లో ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కలెక్టర్ విజయ కృష్ణన్ శుక్రవారం గ్రీవెన్స్ నిర్వహించారు. మొత్తం 13 మంది ఉద్యోగులు వారి సమస్యలపై కలెక్టర్ కు అర్జీలను సమర్పించారు. ప్రతి ఒక్కరి సమస్యను అడిగి తెలుసుకున్నారు. పరిష్కారానికి అవకాశం ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ సుబ్బలక్ష్మి పాల్గొన్నారు.

Similar News

News November 22, 2025

జాతీయ స్థాయిలో జనగామ జిల్లాకు 16వ స్థానం

image

ఓబుల్ కేశవాపూర్ జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాలలో జరుగుతున్న ప్రాథమిక స్థాయి కాంప్లెక్స్ సమావేశంలో అడిషనల్ కలెక్టర్ పింకేశ్ కుమార్, విద్యా శాఖ అధికారులు ఈరోజు పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ.. మన జనగామ జిల్లాకు NAS-2024 ఫౌండేషన్ లెవెల్‌లో జాతీయ స్థాయిలో 16వ స్థానం రావడం చాలా సంతోషకరమన్నారు. అందుకు కృషి చేసిన ఉపాధ్యాయ బృందాన్ని ప్రశంసించారు.

News November 22, 2025

SVU: B.Ed ఫలితాలు విడుదల

image

తిరుపతిలోని శ్రీవేంకటేశ్వర యూనివర్సిటీ పరిధిలో ఈ ఏడాది అక్టోబర్‌లో బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ ( B.Ed) ద్వితీయ సంవత్సరం నాలుగో సెమిస్టర్ పరీక్షలు జరిగాయి. ఈ పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. ఫలితాలను https://www.manabadi.co.in/ వెబ్ సైట్ ద్వారా తెలుసుకోగలరు.

News November 22, 2025

బాలిక ఫొటో మార్ఫింగ్.. వ్యక్తిపై పోక్సో కేసు నమోదు: MHBD టౌన్ CI

image

పోక్సో కేసులో నిందితుడిని అరెస్ట్ చేశామని MHBD టౌన్ CI గట్ల మహేందర్ రెడ్డి తెలిపారు. నిజామాబాద్ ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి కొంతకాలంగా పట్టణ పరిధిలోని ఒక ప్రాంతానికి చెందిన బాలికకు ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమయ్యాడు. ఆ బాలిక ఫొటోను మార్ఫింగ్ చేసి, ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన విషయమై బాధితురాలి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిందితుడిపై పోక్సో, ఐటీ చట్టం కింద కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించామన్నారు.