News March 4, 2025

అనకాపల్లి ఉపాధ్యాయుల సీనియారిటీ జాబితా విడుదల

image

అనకాపల్లి జిల్లాలో అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయుల సీనియారిటీ జాబితాను విడుదల చేసినట్లు డీఈవో అప్పారావు నాయుడు సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఉపాధ్యాయ సమాచార వ్యవస్థ ఆధారంగా జాబితాను రూపొందించినట్లు పేర్కొన్నారు. ఈ జాబితాను తమ కార్యాలయం నోటీస్ బోర్డులో ఉంచామన్నారు. ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే ఈ నెల 10వ తేదీలోగా తెలియజేయాలన్నారు.

Similar News

News March 4, 2025

పిఠాపురం: 14న జనసేనలోకి పెండెం దొరబాబు?

image

పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు కుటుంబ సమేతంగా సోమవారం జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌తో భేటీ అయిన సంగతి తెలిసిందే. దొరబాబును జనసేనలో చేర్చుకునేందుకు పవన్ సముఖంగా ఉన్నారన్న నేపథ్యంలో ఆయన జనసేనలో ఎప్పుడు చేరుతారనేది పిఠాపురంలో హాట్ టాపిక్‌గా మారింది. దొరబాబు అనుచరులతో పెద్ద ఎత్తున పిఠాపురంలో మార్చి 14న జనసేన ఆవిర్భావ సభలో పార్టీ చేరుతారని సమాచారం. దీనిపై అధికారికంగా వెల్లడించాల్సి ఉంది.

News March 4, 2025

సంగారెడ్డి: 20 రోజుల్లో పెళ్లి.. అంతలోనే

image

మంజీర నదిలో యువకుడి మృతదేహం లభ్యమైన విషయం తెలిసిందే. పోలీసుల వివరాలిలా.. నాగల్‌గిద్ద మండలం కరస్ గుత్తికి చెందిన సునీల్ చౌహాన్(23) కొన్ని రోజులుగా పచ్చకామెర్లతో బాధపడుతున్నాడు. శనివారం ఇంటి నుంచి వెళ్లిన సునీల్ తిరిగి రాలేదు. హద్నూర్ పోలీసులు రాఘవపూర్ శివారులో మంజీర నది బ్రిడ్జిపై అతడి బైక్ గుర్తించారు. నదిలో నిన్న సునీల్ మృతదేహం దొరికింది. ఈనెల 26న సునీల్ పెళ్లి జరగాల్సి ఉంది.

News March 4, 2025

గతంలో తిరిగిన దారుల్లోనే పులి మరోసారి సంచారం!

image

గత 20 రోజులకు పైగా పెద్దపులి సంచారం కలవర పెడుతోంది. కాటారం మండలంలోని గుండ్రాత్‌పల్లి అడవుల్లో పెద్దపులి సంచరిస్తున్నట్లు ఆనవాళ్లు అధికారులు గుర్తించినట్లు తెలిసింది. నస్తూర్‌పల్లి అడవుల్లో సంచరించిన పులి.. అన్నారం అడవుల మీదుగా గుండ్రాత్‌పల్లి వచ్చినట్లు తెలుస్తోంది. ఎఫ్ఆర్ఓ స్వాతి, పలువురు అధికారులతో కలిసి అడవిలో పలు ప్రాంతాల్లో గాలింపు చర్యలు చేపట్టారు. పులి గతంలో తిరిగిన దారుల్లోనే తిరుగుతోంది.

error: Content is protected !!