News February 28, 2025

అనకాపల్లి: ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీకి రూ.107.46 కోట్లు

image

అనకాపల్లి జిల్లాలో మార్చి నెల 1వ తేదీన ఎన్టీఆర్ భరోసా పథకం కింద పెన్షన్‌ల పంపిణీకి ప్రభుత్వం రూ.107.46 కోట్లు విడుదల చేసినట్లు డీఆర్డీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ శశీదేవి గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లాలో 2,56,272 మంది లబ్ధిదారులకు శనివారం పెన్షన్ పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు. శుక్రవారం సచివాలయ సిబ్బంది బ్యాంకుల నుంచి పెన్షన్ సొమ్ము డ్రా చేస్తారన్నారు.

Similar News

News February 28, 2025

బంగ్లా పుస్తకాల్లో ఇందిర ఫొటోలు తొలగింపు

image

బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం తమ నూతన పాఠ్య పుస్తకాల్లో మార్పులు చేసింది. బంగ్లాదేశ్ స్వాతంత్య్ర పోరాటంలో సాయం చేసిన భారత మాజీ ప్రధాని ఇందిరాగాంధీ ఫొటోలను తొలగించింది. బంగ్లా నేత షేక్ ముజిబుర్ రెహమాన్ చిత్రాలనూ తీసివేసింది. కాగా పాక్ నుంచి బంగ్లాకు విముక్తి కల్పించేందుకు అప్పట్లో ఇందిరా విశేష కృషి చేశారు. ఇందుకు కృతజ్ఞతగా అక్కడి పుస్తకాల్లో చరిత్ర పుటల్లో నిలిచిపోయేలా ఇందిరా ఫొటోలను ముద్రించారు.

News February 28, 2025

ఒంగోలు: రేపటి నుంచి కొత్త ఫైన్లు..!

image

ట్రాఫిక్ రూల్స్ పాటించకపోతే మార్చి ఒకటో తేదీ నుంచి భారీ ఫైన్లు తప్పవని ఒంగోలు ట్రాఫిక్ సీఐ పాండురంగారావు హెచ్చరించారు. ఫైన్ వివరాలను ఆయన వెల్లడించారు.
➤ హెల్మెట్(బైకుపై ఇద్దరికీ), ఇన్సూరెన్స్ లేకుంటే: రూ.1000
➤ డ్రైవింగ్ లైసెన్స్ లేకపోతే: రూ.10వేలు
➤ బైక్ రేసింగ్(ఓవర్ స్పీడ్): రూ.5 వేలు
➤ మైనర్ డ్రైవింగ్: రూ.1000
➤ డేంజరస్ పార్కింగ్: రూ.1500-రూ.3వేలు
➤ శబ్ద కాలుష్యం చేస్తే: రూ.2వేలు-రూ.4వేలు

News February 28, 2025

‘కూలీ’ రూ.వెయ్యి కోట్లు కలెక్ట్ చేస్తుంది: సందీప్

image

సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా లోకేశ్ కనగరాజ్ తెరకెక్కిస్తోన్న ‘కూలీ’ సినిమా రూ.1000 కోట్లు కలెక్ట్ చేస్తుందని టాలీవుడ్ హీరో సందీప్ కిషన్ అభిప్రాయపడ్డారు. ‘నేను కూలీ సినిమాలో భాగం కాదు. లోకేశ్ నా ఫ్రెండ్ కావడంతో సూపర్ స్టార్‌ను చూసేందుకు కూలీ సెట్స్‌కు వచ్చాను. నేను సినిమాలోని 45 నిమిషాలు చూశాను. ఇది కచ్చితంగా రూ.వెయ్యి కోట్లు వసూలు చేస్తుంది’ అని ఆయన ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

error: Content is protected !!