News February 1, 2025

అనకాపల్లి: ఎన్నికలు ముగిసేవరకు పరిష్కార వేదిక నిలుపుదల

image

ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకు ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిలుపు చేస్తున్నట్లు అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిందన్నారు. మార్చి 8వ తేదీతో ఎన్నికల కోడ్ ముగుస్తుందన్నారు. ఆ తర్వాత నుంచి ప్రజావేదిక కొనసాగిస్తామని ప్రజలు గమనించాలని కోరారు.

Similar News

News February 1, 2025

సిద్దిపేట: ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్.. తుపాకులు అప్పగించండి: CP

image

గ్రాడ్యుయేట్, టీచర్స్ ఎమ్మెల్సీ ఎలక్షన్ కోడ్ అమల్లోకి వచ్చినందున లైసెన్స్ తుపాకులు పొందిన వారు స్థానిక పోలీస్ స్టేషన్లో అప్పగించాలని పోలీస్ కమిషనర్ డాక్టర్ బి.అనురాధ సూచించారు. లైసెన్స్ ఉన్న తుపాకులను స్థానిక పోలీస్ స్టేషన్లో ఈ నెల 8లోగా డిపాజిట్ చేయాలని ఆదేశించారు. ఎన్నికల కోడ్ ముగిసిన అనంతరం యథావిధిగా తీసుకువెళ్లవచ్చని చెప్పారు.

News February 1, 2025

ఎమ్మెల్సీ ఎన్నికలపై కలెక్టర్‌లతో సీఈఓ వీడియో సమావేశం

image

శాసనమండలి సభ్యుల ఎన్నికలు సజావుగా జరిగేలా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి ఆదేశించారు. శనివారం హైదరాబాద్ నుంచి రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి గ్రాడ్యుయేట్, టీచర్స్ ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికలపై జిల్లా కలెక్టర్‌లతో వీడియో సమావేశం ద్వారా సమీక్షించారు. కలెక్టర్ తేజస్, అ.కలెక్టర్ పి. రాంబాబు, అధికారులు పాల్గొన్నారు.

News February 1, 2025

శ్రీలంకను మట్టికరిపించిన ఆసీస్

image

తొలి టెస్టులో SLను ఆస్ట్రేలియా మట్టికరిపించింది. గాలే వేదికగా జరిగిన టెస్టులో వార్ వన్ సైడ్ అయింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ 654-6 వద్ద డిక్లేర్ చేసింది. తొలి INGలో 165కే ఆలౌట్ అయిన శ్రీలంక ఫాలో ఆన్ ఆడింది. 4వ రోజు అందులోనూ 247 పరుగులకే ఆలౌట్ కావడంతో ఆసీస్ ఓ ఇన్నింగ్స్ & 242 రన్స్ తేడాతో గెలుపొందింది. టెస్టుల్లో AUSకు ఇది నాలుగో అతిపెద్ద విజయం. డబుల్ సెంచరీ చేసిన ఖవాజాకు POTM అవార్డు దక్కింది.