News February 27, 2025
అనకాపల్లి: ఎమ్మెల్సీ ఎన్నిక నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి

ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ తెలిపారు. గురువారం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు పోలింగ్ జరుగుతుందన్నారు. జిల్లాలో పోలింగ్ ప్రశాంతంగా నిర్వహించేందుకు అభ్యర్థులు సహకరించాలన్నారు. పోలింగ్ ఏజెంట్లు పోలింగ్ కేంద్రానికి ఉదయం ఏడు గంటలకి చేరుకోవాలని అన్నారు. పోలింగ్ కేంద్రాల్లోకి మొబైల్స్, కెమెరాలకు అనుమతి లేదన్నారు.
Similar News
News February 27, 2025
సిరిసిల్లలో గుర్తుతెలియని వ్యక్తి మృతి

గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందిన ఘటన సిరిసిల్ల పట్టణంలోని చంద్రంపేటలో బుధవారం సాయంత్రం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలిలా.. సిరిసిల్ల పట్టణం చంద్రంపేటలో స్థానికులు గుర్తు తెలియని శవాన్ని గుర్తించారు. వారు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
News February 27, 2025
వట్లూరు పెద్ద చెరువులో స్నానానికి దిగి ఇద్దరు మృతి

పెదపాడు మండలం వట్లూరు గ్రామంలో గల పెద్ద చెరువులో ఇద్దరు వ్యక్తులు పడి గల్లంతైన విషయం తెలిసిందే. గ్రామానికి చెందిన జుజ్జువరపు వెంకటేశ్వరరావు (58)చెరువులో మునిగిపోతున్న క్రమంలో.. కాపాడేందుకు యత్నించిన తమ్ముడి కుమారుడు సుబ్రహ్మణ్యం (32) మృతి చెందాడు. వారి మృతదేహాలను పోలీసులు వెలికితీశారు. దీంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
News February 27, 2025
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకుల మృతి

రొద్దం మండల సమీపంలోని దొమ్మత మర్రివద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందారు. గురువారం తెల్లవారుజామున ద్విచక్ర వాహనంలో రెడ్డి పల్లి నుంచి లేపాక్షికి వెళ్తుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. గాయపడ్డ వారిని హిందూపురం ఆసుపత్రికి తరలించగా తిరుమలేశ్, భరత్ అనే ఇద్దరు యువకులు మృతి చెందారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.