News February 19, 2025
అనకాపల్లి: ఎల్‌టీటీ ఎక్స్‌ప్రెస్ పునరుద్ధరణ

నిర్మాణ పనుల కారణంగా రద్దు చేసిన ఎల్‌టీటీ ఎక్స్‌ప్రెస్(18519/18520)ను పునరుద్ధరించనున్నట్లు వాల్తేరు డివిజన్ సీనియర్ డీసీఎం కె.సందీప్ తెలిపారు. ఈనెల 20న విశాఖ-ఎల్‌టీటీ ఎక్స్‌ప్రెస్ (18519), తిరుగు ప్రయాణంలో ఎల్‌టీటీ-విశాఖ ఎక్స్‌ప్రెస్ (18520) ఈనెల 21న షెడ్యూల్ ప్రకారం యథావిధిగా రాకపోకలు సాగిస్తాయన్నారు. ప్రయాణికుల సౌకర్యార్థం విశాఖ నుంచి దువ్వాడ, విజయవాడ మీదుగా ముంబై వెళ్తుందన్నారు.
Similar News
News December 14, 2025
GNT: రేపు SP పీజీఆర్ఎస్ కార్యక్రమం రద్దు

గుంటూరు జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం జరగాల్సిన ప్రజా సమస్యల పరిష్కారవేదిక (PGRS) కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు ఎస్పీ వకుల్ జిందాల్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. అనివార్య కారణాల వలన ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. ప్రజలు విషయాన్ని గమనించి పీజీఆర్ఎస్‌కి వచ్చే కార్యక్రమాన్ని వాయిదా వేసుకోవాలని ఎస్పీ సూచించారు.
News December 14, 2025
నారాయణపేట DCC సొంతూరిలో కాంగ్రెస్‌కు షాక్

మరికల్ మండలంలోని తీలేరు గ్రామంలో గ్రామ సర్పంచ్‌గా బీఆర్ఎస్, బీజేపీ మిత్రపక్షాల అభ్యర్థి మురారి కాంగ్రెస్ అభ్యర్థి రాముపై 444 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. నారాయణపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ప్రశాంత్ కుమార్ రెడ్డి సొంత గ్రామంలో కాంగ్రెస్ పార్టీకి షాక్ తగిలింది. మురారికి 1,288 ఓట్లు రాగా రాముకు 844 ఓట్లు వచ్చాయి.
News December 14, 2025
పంచాయతీ ఓట్ల లెక్కింపు సజావుగా పూర్తి: కలెక్టర్ సంతోష్

రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల ఓట్ల లెక్కింపు శాంతియుత వాతావరణంలో సజావుగా పూర్తయినట్లు కలెక్టర్ సంతోష్ తెలిపారు. ఆదివారం మల్దకల్ ప్రభుత్వ పాఠశాలలోని కౌంటింగ్ కేంద్రాన్ని ఎస్పీ శ్రీనివాసరావుతో కలిసి ఆయన పరిశీలించారు. ఫలితాల అనంతరం ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్ఠ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ తెలిపారు.


