News October 15, 2025
అనకాపల్లి: ‘ఏపీ ఎక్సైజ్ సురక్ష యాప్‌తో కల్తీ మద్యం గుర్తింపు’

ఏపీ ఎక్సైజ్ సురక్ష యాప్‌తో కల్తీ మద్యాన్ని గుర్తించవచ్చునని అనకాపల్లి జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారి సుధీర్ మంగళవారం తెలిపారు. షాపులో కొనుగోలు చేసిన మద్యం బాటిల్‌పై ఉన్న క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే మొత్తం సమాచారం వస్తుందన్నారు. సమాచారం రాకపోతే కల్తీ మద్యంగా గుర్తించాలన్నారు. బీరు బాటిల్ స్కాన్ చేస్తే ఎటువంటి సమాచారం రాదన్నారు. మద్యం బాటిల్ స్కాన్ చేయడానికే ఇది ఉపయోగపడుతుందన్నారు.
Similar News
News October 15, 2025
నల్గొండ: బాలికపై అత్యాచారం.. ఏడేళ్ల జైలు శిక్ష

నల్గొండలో మైనర్‌పై అత్యాచారం కేసులో పోక్సో కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. తొమ్మిదేళ్ల బాలికపై అత్యాచారం చేసిన ఉప్పల నాగార్జునకు ఏడేళ్ల జైలు శిక్షతో పాటు రూ.15 వేలు జరిమానా విధించింది. బాధితురాలికి రూ.7 లక్షల పరిహారం చెల్లించాలని ఇన్‌ఛార్జ్ న్యాయమూర్తి రోజారమణి తీర్పు చెప్పారు. 2019లో మోతే పోలీస్ స్టేషన్‌లో ఈ కేసు నమోదైంది.
News October 15, 2025
HYD: దొరికారు కాబట్టి దొంగలు.. లేకపోతే!

రోజూ టికెట్ లేకుండా ప్రయాణించడం.. ఆ.. ఎవరు చెక్ చేస్తారులే అనే ధైర్యంతో వారంతా ఇన్ని రోజులూ రైల్లో ప్రయాణాలు చేశారు. అయితే దక్షిణ మధ్య రైల్వే అధికారులు సికింద్రాబాద్, హైదరాబాద్ డివిజన్లతోపాటు ఇతర డివిజన్లలో రైళ్లల్లో తనిఖీలు చేశారు. మంగళవారం ఒక్కరోజే 16,105 కేసులు నమోదు చేశారు. అంతేకాక రూ.1.08 కోట్లను జరిమానాగా వసూలు చేశారు. SECలో రూ.27.9 లక్షలు, HYDలో రూ.4.6 లక్షలు వసూలు చేశారు.
News October 15, 2025
మేడిగడ్డ పునరుద్ధరణకు వడివడిగా అడుగులు

TG: వరదల్లో దెబ్బతిన్న మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల మరమ్మతులకు ప్రభుత్వం చురుగ్గా కదులుతోంది. పునరుద్ధరణ ప్లాన్, డిజైన్లకోసం బిడ్ల దాఖలు నేటితో ముగియనుంది. HYD, మద్రాస్, రూర్కీ IITలు టెండర్లు దాఖలు చేశాయి. మరికొన్ని ప్రముఖ సంస్థలు కూడా బిడ్లు వేసేందుకు రెడీగా ఉండడంతో గడువు పొడిగించడంపై ఆలోచిస్తోంది. NDSA సిఫార్సులకు అనుగుణంగా ఉన్న బిడ్‌ను ఆమోదించి నిర్మాణ పనులకు టెండర్లు పిలవనుంది.