News February 25, 2026

అనకాపల్లి: ఏపీ మోడల్ స్కూల్‌లో ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం

image

జిల్లాలో ఏపీ మోడల్ స్కూల్లో 6వ తరగతిలో ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డీఈవో అప్పారావు నాయుడు మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. 5వ తరగతి చదువుతున్న విద్యార్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించాలన్నారు. ఓసీ, బీసీ అభ్యర్థులకు రూ.200, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.125 పరీక్ష ఫీజు చెల్లించాలన్నారు. ఏప్రిల్ 12న ప్రవేశ పరీక్ష జరుగుతుందన్నారు. పూర్తి వివరాలకు సంబంధిత హెచ్ఎంలను సంప్రదించాలన్నారు.

Similar News

News February 26, 2026

బోయినపల్లి: CMO అధికారిని అంటూ మోసం.. అరెస్ట్

image

రంగారెడ్డి జిల్లా కుట్లూరు ప్రాంతానికి చెందిన సూర్య ప్రకాష్ బెట్టింగులకు బానిసై అధిక డబ్బు సంపాదించాలని దొంగతనాలకు అలవాటుపడ్డాడు. మోటార్ సైకిల్ దొంగలించిన కేసులో అరెస్టై జైలు నుండి బయటకు వచ్చిన తర్వాత సీఎంఓ కార్యాలయంలో పనిచేస్తానని చెప్పి బోయినపల్లి మిడ్ మానేరు DEE రఘుపతికి కాల్ చేసి డబ్బులు డిమాండ్ చేశాడు. దీంతో రఘుపతి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా నిందితుడిని పట్టుకొని రిమాండ్‌కు తరలించారు.

News February 26, 2026

సిద్దిపేట: ప్రభుత్వ బడిలో కలెక్టర్ తనిఖీ

image

సిద్దిపేట ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజన సౌకర్యాలను కలెక్టర్ హైమావతి ఆకస్మికంగా తనిఖీ చేశారు. భోజన నాణ్యతను పరిశీలించిన ఆమె, వంటలను మరింత రుచికరంగా సిద్ధం చేయాలని సిబ్బందిని ఆదేశించారు. బిర్యానీ, సాంబారు నాణ్యత మెరుగుపరచాలని, వంటగది మరియు డైనింగ్ హాల్‌ను నిత్యం శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. విద్యార్థులకు పౌష్టికాహారం అందించడంలో నిర్లక్ష్యం వహించవద్దని హెచ్చరించారు.

News February 26, 2026

అసైన్డ్ భూములు లీజుకు.. ఎకరాకు ₹31 వేలు: అనగాని

image

AP: అసైన్డ్ భూముల చట్ట సవరణకు అసెంబ్లీ ఆమోదం తెలిపిందని మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. ‘క్లీన్ ఎనర్జీ ప్రాజెక్టుల ఏర్పాటుకు కొన్నిచోట్ల అసైన్డ్ భూములు అవసరం. అసైన్‌దారుల అనుమతితో లీజుకు తీసుకుంటాం. లీజుతో వారికి ఆదాయం వస్తుంది. ఎకరాకు ₹31వేలు చొప్పున ఇస్తాం. రెండేళ్లకోసారి 5% వరకు పెంచుతాం’ అని చెప్పారు. 10వేల MW సౌర విద్యుత్ ప్రాజెక్టులు ఏర్పాటవుతాయని, 7.5L మందికి ఉపాధి లభిస్తుందని అన్నారు.