News March 21, 2024

అనకాపల్లి: ఏ.ఎల్ పురం చెక్‌పోస్టు వద్ద రూ.లక్ష సీజ్

image

గొలుగొండ మండలం ఏ.ఎల్ పురం చెక్ పోస్టు వద్ద పోలీసుల తనిఖీల్లో ఆధారాలు లేని రూ.లక్ష నగదు సీజ్ చేసినట్లు కృష్ణదేవిపేట ఎస్ఐ ఉపేంద్ర తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. రాజవొమ్మంగి మండలం శరభవరం గ్రామానికి చెందిన నానిబాబు తన స్నేహితుడితో కలిసి కారులో వెళుతుండగా.. చెక్ పోస్ట్ వద్ద తనిఖీలు చేశామన్నారు. ఏ ఆధారాలు లేని రూ.లక్ష సీజ్ చేసి.. నగదును తహశిల్దార్‌కి పంపించామన్నారు.

Similar News

News February 14, 2026

విశాఖ: బిల్డింగ్ పైనుంచి పడి యువకుడి మృతి

image

విశాఖలోని సాగర్ నగర్‌లో బిల్డింగ్ పరంజి విరిగి యువకుడు మృతి చెందాడు. ఈ ఘటన శుక్రవారం చోటుచేసుకుంది. వాంబేకాలనీకి చెందిన కోలా రాజు(30) డ్రైవింగ్, విద్యుత్ పనులు చేస్తూ జీవిస్తున్నాడు. ఈ క్రమంలోనే శుక్రవారం ఓ బిల్డింగ్‌లో విద్యుత్ పని చేస్తుండగా పరంజి విరిగిపోవటంతో 4 అంతస్థుల పైనుంచి పడి మృతి చెందాడు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని కేజీహెచ్‌కి తరలించారు.

News February 14, 2026

విశాఖ: కోస్టల్ కారిడార్‌లో మార్పులు

image

సవరించిన VMRDA మాస్టర్ ప్లాన్‌లో భోగాపురం ఎయిర్‌పోర్ట్‌ అనుసంధాన బీచ్ కారిడార్‌కు స్వల్ప మార్పులు ప్రతిపాదించారు. కోస్టల్ బ్యాటరీ-కైలాసగిరి వరకు 40M, అక్కడి నుంచి భోగాపురం వరకు 60M వెడల్పుతో రహదారి ప్రతిపాదన, రాడిసన్ బ్లూ వద్ద ఎలివేటెడ్ మార్గం, మూలకుద్దు సమీపంలో ఐకానిక్ బ్రిడ్జి ప్రణాళికలో ఉన్నాయి. ఈ మార్పులు ట్రాఫిక్ సౌలభ్యం, పర్యాటక అభివృద్ధి దృష్టిలో ఉంచుకుని రూపొందించినట్లు అధికారులు తెలిపారు.

News February 14, 2026

VMRDA మాస్టర్ ప్లాన్ రివిజన్..

image

VMRDA మాస్టర్ ప్లాన్-2041ని రివిజన్ చేస్తోంది. గత డ్రాఫ్ట్‌పై వచ్చిన అభ్యంతరాల ఆధారంగా సవరణలు చేపట్టింది. మార్చి 10 వరకు ప్రజల నుంచి అభ్యంతరాలు, సూచనలు స్వీకరించనుంది. 4,380 చ.కి.మీ.ల పరిధిలో పట్టణాభివృద్ధి, రవాణా సౌలభ్యం, పర్యావరణ పరిరక్షణ లక్ష్యంగా చర్యలు కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు. మాస్టర్ ప్లాన్‌ను ప్రభుత్వానికి సమర్పించే ముందు ప్రజాభిప్రాయానికి ప్రాధాన్యం ఇస్తామని స్పష్టం చేశారు.