News March 22, 2025
అనకాపల్లి: క్వారీలో గాయపడిన కార్మికుడి మృతి

అనకాపల్లి మండలం కుంచంగి క్వారీలో శుక్రవారం పనులు చేస్తుండగా ప్రమాదవశాత్తు గాయపడిన కార్మికుడు అనకాపల్లి ఎన్టీఆర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఎస్ఐ రవికుమార్ తెలిపారు. మృతి చెందిన కార్మికుడు ఒడిశా రాష్ట్రానికి చెందిన జానీగా పేర్కొన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు.
Similar News
News September 15, 2025
పులిపిర్లకు ఇలా చెక్ పెట్టేద్దాం

వివిధ ఆరోగ్య సమస్యలు, వైరల్ ఇన్ఫెక్షన్ల వల్ల చాలామందిలో పులిపిర్లు వస్తుంటాయి. వీటిని వదిలించుకోవాలంటే ఈ చిట్కాలు పాటించండి. • దూదిని యాపిల్‌సైడర్ వెనిగర్‌లో ముంచి పులిపిర్లపై అద్దుతూ ఉంటే త్వరగా తగ్గిపోతాయి. • కలబందను పులిపిర్లపై రాస్తే కొద్దిరోజుల్లోనే రాలిపోతాయి. • ఆముదంలో బేకింగ్ పౌడర్ కలిపి, దాన్ని పులిపిర్లపై రాసి బ్యాండేజ్ వేయాలి. ఇలా మూడు రోజులు చేస్తే పులిపిర్లు పూర్తిగా పోతాయి.
News September 15, 2025
చీనీ, నిమ్మలో తెగుళ్లు.. నివారణ

చీనీ, నిమ్మ తోటల్లో ఆకు, కాయ మచ్చ తెగులు(ఆల్టర్నేరియా) కనపడుతోంది. ఇది సోకితే ఆకులపై మచ్చల చుట్టూ పసుపు రంగు వలయం, కాయలపై ముదురు గోధుమ, నలుపు రంగులో మచ్చలు ఏర్పడతాయి. దీనివల్ల పంట దిగుబడి తగ్గిపోతుంది. నివారణకు 2 గ్రా. క్లోరోథలోనిల్, 1ML అజాక్సీస్ట్రోబిన్, 1ML ప్రొపికొనజోల్ మందులను లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. ఎండిన కొమ్మలు, తెగులు సోకిన ఆకులు, కాయలను ఏరివేసి నాశనం చేయాలి.
News September 15, 2025
నవంబర్‌లో టెట్: కోన శశిధర్

AP: మెగా DSCలో ఎంపికైన వారికి ఈ నెల 22 నుంచి 29 వరకు కేటాయించిన జిల్లాలో ట్రైనింగ్ ఇస్తామని పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ తెలిపారు. ఆ తేదీల్లోనే కౌన్సెలింగ్ కూడా పూర్తి చేసి పోస్టింగులు ఇస్తామన్నారు. ఈ నోటిఫికేషన్‌లో భర్తీ కాని 406 పోస్టులను వచ్చే డీఎస్సీలో కలుపుతామని చెప్పారు. ఇక నుంచి ప్రతి ఏడాది DSC నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఈ నవంబర్‌లో టెట్ ఉంటుందని, ప్రిపేర్ కావాలని సూచించారు.