News February 25, 2025
అనకాపల్లి: గుర్తు తెలియని వ్యక్తి మృతి

అనకాపల్లి పట్టణం తోటాడ జంక్షన్ వద్ద జాతీయ రహదారిపై గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందాడు. ఈ మేరకు స్థానికులు సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్ఐ వెంకటేశ్వరరావు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్థానిక ఎన్టీఆర్ ఆసుపత్రికి పోస్ట్ మార్టం కోసం పంపించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతికి సంబంధించి కారణాలు దర్యాప్తులో తెలియాల్సి ఉంది.
Similar News
News February 25, 2025
రైలు కిందపడి కాసిపేట యువకుడి సూసైడ్

మంచిర్యాల జిల్లా కాసిపేట మండలానికి చెందిన యువకుడు రైలు కిందపడి సూసైడ్ చేసుకున్నట్లు రైల్వే హెడ్ కానిస్టేబుల్ రాజేశ్వర్ తెలిపారు. మండల కేంద్రానికి చెందిన క్రాంతి(29) ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు, వివాహం కావడం లేదని మనస్తాపానికి గురై కల్వరి చర్చి వద్ద రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నట్లు వెల్లడించారు. రైల్వే ఎస్ఐ ఆదేశాల మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పేర్కొన్నారు.
News February 25, 2025
వరంగల్: క్వింటా పత్తి ధర రూ.6900

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో నిన్నటితో పోలిస్తే ఈరోజు పత్తి ధర రూ.10 పెరిగింది. సోమవారం క్వింటా పత్తి ధర రూ.6,890 ధర పలకగా.. నేడు రూ.6900 అయినట్లు అధికారులు తెలిపారు. అయితే ఆశించిన స్థాయిలో ధర రావడం లేదని రైతులు నిరాశ చెందుతున్నారు. ధరలు పెరిగేలా ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాలని అన్నదాతలు కోరుతున్నారు.
News February 25, 2025
HYDలో పెరిగిన హలీం ధరలు

ఏడాదికోసారి నోరూరించే హలీం ధరలు అమాంతం పెరిగాయి. HYDలో పలుచోట్ల రంజాన్ ప్రారంభానికి ముందే హలీం దుకాణాలు వెలిశాయి. బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్‌తో చికెన్ వినియోగం పూర్తిగా తగ్గి, మటన్ ధరలు పెరగడంతో రేట్లు పెంచేశారు. గతేడాది ప్రముఖ హలీం సెంటర్లలో ప్లేట్ గరిష్ఠంగా రూ.280 ఉండేది. కాగా.. ఈ ఏడాది ఆయా సెంటర్లలో రూ.300-350 వరకు అమ్ముతున్నారు. ఇంతకీ HYDలో ది బెస్ట్ హలీం ఎక్కడ దొరుకుతుందో కామెంట్ చేయండి.