News February 26, 2025
అనకాపల్లి: చట్ట విరుద్ధమైన సమావేశాలపై నిషేధం

ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నిక ఈనెల 27న జరుగుతున్న నేపథ్యంలో మంగళవారం నుంచి ఈనెల 28వ తేదీ వరకు అనకాపల్లి జిల్లాలో చట్టవిరుద్ధమైన సమావేశాలు, ర్యాలీలను నిషేధించినట్లు కలెక్టర్ విజయకృష్ణన్ ప్రకటించారు. అలాగే లౌడ్ స్పీకర్లకు అనుమతి లేదన్నారు. పోలింగ్ స్టేషన్‌కు 200 మీటర్ల దూరంలో ఐదుగురు కంటే ఎక్కువమంది గుమ్మికూడి ఉండరాదని అన్నారు. పై ఆదేశాలను దిక్కరిస్తే చర్యలు తప్పవన్నారు.
Similar News
News February 26, 2025
వరంగల్: నలుగురి ARREST

వరంగల్ కాశిబుగ్గలోని శాంతినగర్ చెరువు కట్టమీద నలుగురు వ్యక్తులు గంజాయి తాగుతుండగా పెట్రోలియం చేస్తూ వచ్చిన పోలీసులు వారిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. వారి వద్ద నుంచి రూ.25,000 విలువ చేసే కేజీ గంజాయి, నాలుగు సెల్ ఫోన్స్, రూ.17,500 నగదును స్వాధీనపరచుకున్నామన్నారు. వారిపై కేసు నమోదు చేసి జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించినట్లు ఇంతేజార్గంజ్ పోలీసులు తెలిపారు.
News February 26, 2025
కురవిలో జాతర START

కురవిలోని శ్రీ వీరభద్ర స్వామివారి కళ్యాణానికి మంగళవారం అర్చకులు, అంకురార్పణ పూజాకార్యక్రమం నిర్వహించారు. బుధవారం జరిగే స్వామివారి కళ్యాణానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని ఈవో ఒక ప్రకటనలో తెలిపారు. స్వామివారి కళ్యాణం కాగానే పురవీధుల గుండా, ఊరేగింపు నిర్వహిస్తామని తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా కోరారు.
News February 26, 2025
భువనగిరి: ఎమ్మెల్సీ ఎన్నికలకు సర్వం సిద్ధం

భువనగిరి జిల్లా వ్యాప్తంగా ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. జిల్లాలో 17 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు.104 మంది పోలింగ్ సిబ్బందిని,17 మంది మైక్రో అబ్జర్వర్లను నియమించారు. 214 మంది పోలీసులను బందోబస్తు కోసం నియమించినట్లు అధికారులు తెలిపారు.