News December 20, 2025
అనకాపల్లి: జడ్పీ స్టాండింగ్ కమిటీ సమావేశాలు వాయిదా

ఉమ్మడి విశాఖ జిల్లా జడ్పీ స్టాండింగ్ కమిటీ సమావేశాలను ఈనెల 26వ తేదీకి వాయిదా వేసినట్లు సీఈవో నారాయణమూర్తి శుక్రవారం తెలిపారు. సీఎం చంద్రబాబు అనకాపల్లి జిల్లాలో పర్యటిస్తున్న కారణంగా శనివారం జరగాల్సిన ఈ సమావేశాలను వాయిదా వేశామన్నారు. ఈ విషయాన్ని సభ్యులు, అధికారులు గమనించాలని విజ్ఞప్తి చేశారు.
Similar News
News December 22, 2025
ఏలూరు: ‘92.34 శాతం పల్స్ పోలియో పూర్తి చేశాం’

ఏలూరు జిల్లా వ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమం విజయవంతంగా నిర్వహించామని డీఎంహెచ్వో అమృతం స్పష్టం చేశారు. 2,00,004 మంది చిన్నారులకు 1,84,685 (92.34%) మంది పిల్లలకు మ్యానువల్‌గా పల్స్ పోలియో చుక్కలు వేయడం జరిగిందన్నారు. పల్స్ పోలియో నుంచి ఒక పిల్లవాడు కూడా తప్పిపోకుండా కృషి చేస్తున్నామన్నారు. 22, 23వ తేదీల్లో హౌస్ టు హౌస్ కార్యక్రమంలో నూరు శాతం పూర్తయ్యాల కృషి చేస్తామన్నారు.
News December 22, 2025
నెల రోజుల్లో భారీగా పెరిగిన చికెన్ ధరలు

TG: కోడిగుడ్ల <<18636145>>ధరలతో<<>> పాటు చికెన్ ధరలు కూడా భారీగా పెరిగాయి. కార్తీక మాసం తర్వాత నెల రోజుల వ్యవధిలోనే చికెన్ సెంటర్ల నిర్వాహకులు పలు చోట్ల ఏకంగా రూ.100 పెంచి అమ్మకాలు కొనసాగిస్తున్నారు. నెల కిందటి వరకు రూ.210-220 ఉండగా ఇప్పుడు రూ.300కు చేరింది. న్యూఇయర్ వరకు రూ.330కి చేరవచ్చని నిర్వాహకులు చెబుతున్నారు. ఉష్ణోగ్రతలు పడిపోవడం, ఉత్పత్తి తగ్గడం, దాణా ఖర్చులు పెరగడమే దీనికి కారణమని అంటున్నారు.
News December 22, 2025
తూ.గో: బ్యాగు నుంచి సౌండ్.. ప్రయాణికుల పరుగులు

నిడదవోలు-భీమవరం ప్యాసింజర్ రైలులో ఆదివారం ఓ బ్యాగు కలకలం సృష్టించింది. సీటు కింద ఉన్న సంచి నుంచి బీప్ సౌండ్ రావడంతో ప్రయాణికులు బాంబుగా భావించి పరుగులు తీశారు. సమాచారం అందుకున్న ఆర్పీఎఫ్ పోలీసులు బ్యాగును తనిఖీ చేయగా, అందులో ‘ఫోన్ పే’ సౌండ్ బాక్స్, బిర్యానీ ప్యాకెట్, దుస్తులు ఉన్నట్లు గుర్తించారు. దొంగతనం చేసిన వ్యక్తి ఆ బ్యాగును రైలులో వదిలి వెళ్లి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.


