News March 10, 2025

అనకాపల్లి జిల్లాకు చేరిన పది పరీక్షల ప్రశ్నాపత్రాలు

image

పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల ప్రశ్నాపత్రాలు ఆదివారం అనకాపల్లి పోలీసు స్టేషన్‌కు చేరాయి. సంబంధిత ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు వీటిని పరిశీలించిన అనంతరం స్టేషన్‌లోనే భద్రపరిచారు. ఈ నెల 17వ తేదీ నుంచి 31వ తేదీ వరకు పదో తరగతి పరీక్షలు జరగనున్న విషయం తెలిసిందే. ఆయా రోజుల్లో పరీక్ష ప్రారంభం కావడానికి కొద్దిసమయం ముందు ప్రశ్నాపత్రాలను పోలీసు స్టేషన్‌ నుంచి పరీక్షా కేంద్రాలకు తరలిస్తారు.

Similar News

News September 16, 2025

సిరిసిల్ల: ‘మోక్షగుండం విశ్వేశ్వరయ్య సేవలు మరువలేనివి’

image

సిరిసిల్లలోని కలెక్టరేట్లో మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతి సందర్భంగా ఇంజనీర్స్ డే వేడుకలను అధికారులు సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా టీజీవో జిల్లా అధ్యక్షుడు సమరసేన్ మాట్లాడుతూ.. మోక్షగుండం విశ్వేశ్వరయ్య దేశ నిర్మాణం కోసం చేసిన సేవలు ఎన్నటికీ మరువలేని కొనియాడారు. ఆయన నిర్మించిన సాగునీటి, తాగునీటి కట్టడాలు ఆయనకున్న పట్టుదల నిజాయితీని ప్రపంచం కీర్తించిందని పేర్కొన్నారు.

News September 16, 2025

ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 9 అర్జీలు: ఎస్పీ

image

ప్రజా ఫిర్యాదుల పరిష్కారానికి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని, అర్జీలు పునరావృతం కాకుండా చట్ట పరిధిలో శాశ్వత పరిష్కారం చూపాలని ఎస్పీ శ్రీ అద్నాన్ నయీం అస్మీ అన్నారు. పాలకోడేరు మండలం గరగపర్రులోని జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా వేదికకు 9 అర్జీలు వచ్చాయన్నారు. వాటిని నిర్ణీత గడువులోగా పరిష్కరించాలన్నారు.

News September 16, 2025

ప.గో: 13 మంది ఉద్యోగులకు పదోన్నతి

image

ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పరిషత్‌లో ఏఓలు, డిప్యూటీ ఎంపీడీవోలుగా పనిచేస్తున్న 13 మంది ఉద్యోగులకు పదోన్నతి కల్పిస్తూ జడ్పీ ఛైర్‌పర్సన్ ఘంటా పద్మశ్రీ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. తమ శ్రమను గుర్తించి ఇచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటామని ఆమె తెలిపారు. ఉద్యోగుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నానని ఈ సందర్భంగా పేర్కొన్నారు.