News January 29, 2025

అనకాపల్లి జిల్లాలో అమల్లోకి ఎన్నికల కోడ్

image

ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ నియోజకవర్గ ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల కమిషన్ ప్రకటించినట్లు అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ తెలిపారు. వచ్చేనెల 3న నోటిఫికేషన్ జారీ అవుతుందన్నారు. 10వ తేదీ నామినేషన్లకు చివరి రోజుగా పేర్కొన్నారు. ఉపసంహరణకు 13 చివరి తేదీ అని తెలిపారు. పోలింగ్ ఫిబ్రవరి 27వ తేదీన, మార్చి 3న ఓట్ల లెక్కింపు జరుగుతుందని పేర్కొన్నారు. బుధవారం నుంచి ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిందన్నారు.

Similar News

News February 2, 2026

ఖమ్మం కమిషనరేట్‌లో పోలీస్‌ యాక్ట్‌ అమలు

image

ఖమ్మం జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణ నిమిత్తం ఈనెల 28వ తేదీ వరకు సిటీ పోలీస్‌ యాక్ట్‌ నిబంధనలు అమలులో ఉంటాయని సీపీ సునీల్‌ దత్‌ తెలిపారు. ముందస్తు అనుమతి లేకుండా ర్యాలీలు, ధర్నాలు, బహిరంగ సభలు, ఊరేగింపులు నిర్వహించడం నిషేధమని స్పష్టం చేశారు. నిబంధనలు ఉల్లంఘించి గుమిగూడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ముఖ్యంగా సోషల్‌ మీడియాలో అసత్య ప్రచారాలు చేసే వారిపై ప్రత్యేక నిఘా ఉంచామని పేర్కొన్నారు.

News February 2, 2026

భద్రాద్రి జిల్లాలో 9 నామినేషన్ల ఉపసంహరణ

image

భద్రాద్రి కొత్తగూడెం జిల్లావ్యాప్తంగా ఆదివారం మూడు మున్సిపాలిటీల్లో మొత్తం 9 మంది అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నట్లు అధికారులు తెలిపారు. అశ్వారావుపేటలో ఆరుగురు కాంగ్రెస్ అభ్యర్థులు పోటీ నుంచి తప్పుకోగా.. కొత్తగూడెం కార్పొరేషన్ పరిధిలో కాంగ్రెస్ నుంచి ఇద్దరు, సీపీఐ నుంచి ఒకరు నామినేషన్లు విత్‌డ్రా చేసుకున్నారు. ఇల్లందులో మాత్రం ఎలాంటి ఉపసంహరణలు జరగలేదని అధికారులు వెల్లడించారు.

News February 2, 2026

జకోవిచ్.. ఆ టైటిల్ ఎప్పుడు నెగ్గుతాడో?

image

ఆస్ట్రేలియన్ ఓపెన్ 2026 ఫైనల్‌లో వరల్డ్ నంబర్ వన్ కార్లోస్ అల్కరాజ్ చేతిలో ఓటమితో జకోవిచ్ తీవ్ర నిరాశకు గురయ్యారు. ఈ టోర్నీలో ఫైనల్ చేరిన 10సార్లూ జకోవిచ్ విజయం సాధించారు. నిన్న జరిగిన ఫైనల్లోనూ గెలిచి, 25వ గ్రాండ్ స్లామ్ సింగిల్స్ టైటిల్ సాధించాలన్న జకోవిచ్ ఆశలపై అల్కరాజ్ నీళ్లు చల్లారు. 2023 యూఎస్ ఓపెన్ తర్వాత ఈ సెర్బియా వీరుడు ఒక్క సింగిల్ గ్రాండ్ స్లామ్‌ టైటిల్‌నూ గెలవలేదు.