News March 9, 2026

అనకాపల్లి జిల్లాలో ఇద్దరికి పదేళ్ల జైలు శిక్ష

image

ఇద్దరు గంజాయి నిందితులకు చోడవరం 9వ అదనపు జిల్లా కోర్టు పదేళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు ఒక్కొక్కరికి రూ.1 లక్ష జరిమానా విధిస్తూ తీర్పు ఇచ్చినట్లు ఎస్పీ తుహీన్ సిన్హా సోమవారం తెలిపారు. నిందితులు వి.జయరాం, జి.భీమరాజు 2016 సెప్టెంబర్ నెలలో 148 కిలోల గంజాయిని అక్రమంగా తరలిస్తూ గౌరీ పట్నం వద్ద పట్టుబడినట్లు తెలిపారు. నేరం రుజువు కావడంతో శిక్ష పడిందన్నారు.

Similar News

News March 9, 2026

జలుమూరులో యాక్సిడెంట్..ఒకరు స్పాట్ డెడ్

image

జలుమూరు మండలం లింగాలపాడు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వృద్ధుడు మృతి చెందాడు. స్థానికుల వివరాల ప్రకారం..లింగాలపాడుకు చెందిన సూర్యనారాయణ (79) సోమవారం ఉదయం బహిర్భూమికి వెళ్లి వస్తుండగా నరసన్నపేట వైపు వెళ్తున్న టాటా ఏసీ వాహనం ఢీకొనడంతో తలకు గాయమై తీవ్ర రక్తస్రావమైంది. అనంతరం వృద్ధుడు అపస్మారక స్థితికి చేరుకొని ప్రాణాలను వదిలాడు. ఎస్సై అశోక్ బాబు కేసు నమోదు చేశారు.

News March 9, 2026

12న కొమురవెల్లి మల్లన్న హుండీ లెక్కింపు

image

కొమురవెల్లి మల్లికార్జున స్వామి వారి దేవస్థాన హుండీల లెక్కింపు గురువారం నిర్వహించనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి నగదు, బియ్యం హుండీల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమానికి సంబంధిత అధికారులు తప్పనిసరిగా హాజరుకావాలని ఆలయ కార్యనిర్వాహక అధికారి (ఈవో ) కోరారు. కొన్ని రోజులుగా భక్తులు మొక్కుల రూపంలో సమర్పించిన కానుకలను పారదర్శకంగా లెక్కించనున్నట్లు వెల్లడించారు.

News March 9, 2026

కాకినాడ: మృతదేహాల మిస్టరీ వీడింది..!

image

కోటనందూరు మండలం కాకరపల్లి శివారు చెరువులో లభ్యమైన మృతదేహాలను నర్సీపట్నం ప్రాంతానికి చెందిన భాగ్యలక్ష్మి(35), ఆమె కుమారుడు సాయి(3)గా పోలీసులు సోమవారం గుర్తించారు. కుటుంబ కలహాల వల్ల భాగ్యలక్ష్మి కుమారుడితో సహా ఆత్మహత్య చేసుకున్నట్లు అనుమానిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు CI చెన్నకేశవరావు తెలిపారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.