News April 2, 2026
అనకాపల్లి జిల్లాలో ఎమ్మార్వోల డిప్యూటేషన్ పోస్టింగ్స్

అనకాపల్లి జిల్లాలో ఏడుగురు MROలను డిప్యూటేషన్‌పై నియమిస్తూ కలెక్టర్ విజయకృష్ణన్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.
➱రోలుగుంట MRO నాగమ్మ కలెక్టరేట్‌కు ➱నక్కపల్లి MRO శ్రీనుని అచ్యుతాపురం
➱సబ్బవరం MRO చిన్నికృష్ణని నక్కపల్లి ➱మునగపాక MRO సత్యనారాయణను రాంబిల్లి
➱రాంబిల్లి MRO శ్రీనివాసరావు కలెక్టరేట్‌కు ➱మునగపాక MROగా కలెక్టరేట్ నుంచి పీవీ రత్నం
➱అల్లూరి నుంచి అరుణచంద్రను సబ్బవరం MROగా నియమించారు.
Similar News
News April 2, 2026
అభిషేక్ శర్మ ఔటా? నాటౌటా?

IPL: KKRతో మ్యాచులో అభిషేక్ శర్మ (48) క్యాచ్ చర్చనీయాంశంగా మారింది. ముజరబాని వేసిన బంతిని అభిషేక్ షాట్ ఆడగా బౌండరీ దగ్గర వరుణ్ చక్రవర్తి అందుకున్నారు. అయితే క్యాచ్ పట్టడానికి ముందు బాల్ నేలను తాకిందని పలువురు నెటిజన్లు పోస్టులు చేస్తున్నారు. తొలి మ్యాచులో క్లాసెన్ ఔట్ సైతం వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. మరి అభిషేక్ ఔటా? నాటౌటా? కామెంట్ చేయండి.
News April 2, 2026
మెదక్: ఫిజికల్ సైన్స్ పరీక్షకు 99.83% హాజరు

మెదక్ జిల్లాలో 10వ తరగతి వార్షిక పరీక్షల్లో భాగంగా ఫిజికల్ సైన్స్ పరీక్షకు 99.83 శాతం విద్యార్థులు హాజరయ్యారు. మొత్తం 11,247 మందికి గాను 11,228 మంది పరీక్ష రాశారని జిల్లా విద్యాశాఖ అధికారి విజయ తెలిపారు. పరీక్షా కేంద్రాలను జిల్లా విద్యాశాఖ అధికారి, ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు తనిఖీ చేసినట్లు పేర్కొన్నారు.
News April 2, 2026
TPT: టెన్త్ పరీక్షలు.. 145 మంది గైర్హాజరు

రాష్ట్ర వ్యాప్తంగా గురువారం 10వ తరగతి ఆంగ్లం పరీక్ష జరిగింది. తిరుపతి జిల్లా వ్యాప్తంగా 26,825 మంది విద్యార్థులకు గాను 26,680 మంది హాజరుకాగా 145 మంది గైర్హాజరు అయినట్లు DEO కుమార్ పేర్కొన్నారు. 165 పరీక్షా కేంద్రాల్లో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రశాంతంగా పరీక్షలు జరిగినట్లు ఆయన పేర్కొన్నారు.


