News July 7, 2025
‘అనకాపల్లి జిల్లాలో కల్తీ మద్యం.. ఇద్దరు అరెస్ట్’

కల్తీ మద్యం తయారు చేస్తూ ఈనెల రెండవ తేదీన పట్టుబడిన నిందితులు రుత్తల రాము, ఎలమంచిలి వెంకటేశ్వరరావును రిమాండ్‌కు తరలించినట్లు జిల్లా ఎక్సైజ్ అధికారి సుధీర్ తెలిపారు. ఆదివారం అనకాపల్లిలో ఆయన మాట్లాడుతూ.. వీరిద్దరూ కల్తీ మద్యం వ్యాపారాన్ని రెండున్నర ఏళ్ల నుంచి నిర్వహిస్తున్నట్లు విచారణలో తేలిందన్నారు. నిందితుల వెనుక టీడీపీ నేత ఉన్నారని జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు.
Similar News
News July 7, 2025
గొంతుకోసి చిన్నారి హత్య.. చిన్నమ్మే హంతకురాలు?

TG: జగిత్యాల కోరుట్లలో ఐదేళ్ల చిన్నారి హితీక్ష హత్య కేసు ఊహించని మలుపు తిరిగింది. కుటుంబ తగాదాలతో హితీక్షను చిన్నమ్మే చంపినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. సీసీ ఫుటేజీ ఆధారంగా ఆమెను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. శనివారం పిల్లలతో ఆడుకునేందుకు వెళ్లిన చిన్నారి బాత్రూమ్‌లో శవమై తేలింది. నిన్న చిన్నారి అంత్యక్రియలు ముగిశాయి. కుటుంబసభ్యులు, స్థానికులు హితీక్షకు కన్నీటి వీడ్కోలు పలికారు.
News July 7, 2025
ఢిల్లీకి బయల్దేరిన సీఎం రేవంత్

TG: సీఎం రేవంత్ హైదరాబాద్‌లోని శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ నుంచి ఢిల్లీకి బయల్దేరారు. రెండు రోజులపాటు అక్కడే ఉండనున్నారు. పలువురు కేంద్ర మంత్రులతో సమావేశమై రాష్ట్రానికి రావాల్సిన నిధులు, పెండింగ్ ప్రాజెక్టులపై చర్చించనున్నారు. మెట్రో రైలు విస్తరణ ప్రాజెక్టు, RRRకు అనుమతులు, మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టుకు నిధులు కోరనున్నారు.
News July 7, 2025
జనగామ: సీనియర్ V/S జూనియర్..!

జిల్లాలో రాజకీయాలు వాడివేడిగా కొనసాగుతున్నాయి. స్థానిక ఎన్నికలే లక్ష్యంగా సీనియర్ నాయకులు పావులు కదుపుతున్నారు. కాగా జిల్లాలోని మూడు నియోజకవర్గాల్లో ప్రతి పార్టీలో సీనియర్ V/S జూనియర్ రాజకీయాలు నడుస్తున్నట్లు స్థానికులు చర్చించుకుంటున్నారు. రిజర్వేషన్లు తమకు అనుకూలంగా రావాలని వేచి చూస్తున్నారు. అయితే జిల్లాలో యువత రాజకీయాల వైపునకు ఎక్కువ మొగ్గు చూపుతుండటం గమనార్హం.