News September 12, 2025

అనకాపల్లి జిల్లాలో కేజీబీవీ రాష్ట్ర కో-ఆర్డినేటర్ విజిట్

image

సబ్బవరం, మునగపాక, కసిమికోట,అడ్డురోడ్డు తదితర kGBVపాఠశాల ఆ సంస్థ రాష్ట్ర కోర్డినేటర్ దేవానందరెడ్డి గురువారం విజిట్ చేశారు. బాలికల విద్య భవితకు వెలుగు అనే నినాదంతో kGBVపాఠశాలలను ప్రభుత్వం ప్రారంభించిందని, అవి విజయవంతంగా నిర్వహించబడుతున్నాయని అన్నారు. బడుగు బలహీన అనాథ వర్గాల ఆడపిల్లలు చదువుకి దూరమవ్వరాదనే లక్ష్యంతో ఈ విద్యాలయాలు పనిచేస్తున్నాయన్నారు. మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామన్నారు.

Similar News

News April 5, 2026

గుంటూరులో రూ.లక్షల్లో మోసం.. మహిళపై కేసు

image

బంగారం షాపు యజమానిని మోసం చేసిన మహిళపై అరండల్ పేట స్టేషన్‌లో కేసు నమోదైంది. ఫైనాన్స్‌లో ఉన్న తన బంగారాన్ని విడిపించు కోవాలని చెప్పి ఓ మహిళ బంగారం షాపు యజమాని వద్ద రూ.19 లక్షల నగదుతో పాటు రూ.4 లక్షల విలువైన ఆభరణాలను అప్పుగా తీసుకుంది. ఆమె తీసుకున్న నగదు, బంగారాన్ని తిరిగి ఇవ్వకుండా తాత్సారం చేస్తోంది. దీంతో బంగారం షాపు యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశారు.

News April 5, 2026

ఉప్పల్‌లో SRHకు అదిరిపోయే రికార్డులు!

image

IPL: హోంగ్రౌండ్ ఉప్పల్‌లో SRH తన పర్ఫార్మెన్స్‌తో అభిమానులను ఊర్రూతలూగిస్తూనే ఉంటుంది. 2013 నుంచి ఈ గ్రౌండులో ఆ జట్టు 63 మ్యాచులు ఆడగా 38 విజయాలను సొంతం చేసుకుంది. విన్నింగ్ పర్సెంటేజ్ 61కి పైనే ఉంది. మరోవైపు లీగ్‌లో ఇప్పటి వరకు నమోదైన రెండో అత్యధిక స్కోర్(286) గత సీజన్లో RRపై చేసింది. 2025లోనే పంజాబ్ జట్టుపై 247 పరుగులనూ ఛేదించింది. ఇక ఉప్పల్‌లో సెకండ్ బ్యాటింగ్ చేసిన జట్లే 57% గెలవడం గమనార్హం.

News April 5, 2026

నరసన్నపేట: కల్తీ ఆహారంపై కనికరమేల..?

image

నరసన్నపేటలో నాణ్యతలేని ఆహార విక్రయాలు భారీగా సాగుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. మిల్క్ షేక్, హోటల్స్, స్వీట్ స్టాల్స్, రోడ్ సైడ్ ఫాస్ట్ ఫుడ్ అమ్మకాలలో నాణ్యతా ప్రమాణాలు లేవనే ఆరోపణలు ఉన్నాయి. ఫుడ్ సేఫ్టీ అధికారులు ఎటువంటి తనిఖీలు నిర్వహించినట్లు సమాచారం లేదని పలువురు ఆరోపిస్తున్నారు. ఇటీవల సింగపురంలో జరిగిన కల్తీ బాదంపాలు ఘటన అందరికీ తెలిసిందే. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలన్నారు.