News March 16, 2025
అనకాపల్లి: జిల్లాలో పదో తరగతి పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి

అనకాపల్లి జిల్లాలో ఈనెల 17 నుంచి జరిగే పదో తరగతి పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు డీఈవో అప్పారావు నాయుడు తెలిపారు. జిల్లాలో 107 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మొత్తం 22,042 మంది పరీక్షలకు హాజరవుతున్నట్లు పేర్కొన్నారు. వీరిలో బాలికలు 10,968 మంది, బాలురు 11,074 మంది ఉన్నట్లు తెలిపారు. 31 వరకు పరీక్షలు జరుగుతాయన్నారు. రోజు ఉదయం 9:30 గంటలకు పరీక్ష ప్రారంభం అవుతుందన్నారు.
Similar News
News March 16, 2025
నన్ను రెహమాన్ మాజీ భార్య అని పిలవొద్దు: సైరా బాను

సంగీత దర్శకుడు రెహమాన్ నుంచి తానింకా విడాకులు తీసుకోలేదని సైరా బాను ఓ ప్రకటనలో తెలిపారు. తనను అప్పుడే మాజీ భార్యగా పిలవొద్దని విజ్ఞప్తి చేశారు. ‘నా అనారోగ్య సమస్యల కారణంగా మేం విడిపోయాం తప్ప ఇంకా విడాకులు తీసుకోలేదు. ఈరోజు ఆస్పత్రిపాలైన ఆయన వేగంగా కోలుకోవాలి’ అని ఆకాంక్షించారు. ఈ దంపతులకు 1995లో పెళ్లైంది. ముగ్గురు పిల్లలున్నారు. తాము విడిపోతున్నట్లు గత ఏడాది నవంబరులో బాను ప్రకటించారు.
News March 16, 2025
‘మహిళల అభ్యున్నతికి ప్రభుత్వం కృషి చేస్తుంది’

పెనుగొండలో జిల్లా రచయితల సంఘం ఆధ్వర్యంలో జరిగిన మహిళా దినోత్సవ వేడుకల్లో పలు రంగాల్లో రాణించిన స్త్రీలకు మహిళా శిరోమణి పురస్కారాలను మంత్రి సవిత, ఎమ్మెల్యే పరిటాల సునీత లు అందజేశారు. మహిళల అభ్యున్నతికి టీడీపీ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఉద్యోగ, రాజకీయాల్లో స్త్రీలకు ప్రాధాన్యం ఇస్తామన్నారు. ప్రతి మహిళ శక్తి యాప్‌ను డౌన్లోడ్ చేసుకుని, పోలీసుల సాయం పొందాలని ఎస్పీ రత్న, ఆర్డీఓ సువర్ణ తెలిపారు
News March 16, 2025
గుడ్ న్యూస్.. ఈ నెల 21 నుంచి వర్షాలు

TG: ఎండలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న రాష్ట్ర ప్రజలకు వాతావరణ శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. ఈ నెల 21 నుంచి రాష్ట్రంలో అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రెండు రోజులు తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. మరోవైపు రేపు, ఎల్లుండి ఆదిలాబాద్, కొమురం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాలలో వడగాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించింది.