News September 20, 2025

‘అనకాపల్లి జిల్లాలో పెరిగిన భూగర్భ జలాల నీటిమట్టం’

image

జిల్లా వ్యాప్తంగా భూగర్భ జలాల నీటిమట్టం పెరిగినట్లు గ్రౌండ్ వాటర్ విభాగం జిల్లా అధికారిణి శోభారాణి శనివారం కోటవురట్లలో తెలిపారు. వర్షాలు పడుతున్న కారణంగా నీటిమట్టం పెరిగిందన్నారు. గత ఏడాది ఆగస్టు నాటికి భూగర్భ జలాల నీటిమట్టం 5.26 మీటర్లు లోతుకు ఉండగా ఈ ఏడాది అదే నెలలో 4.35 మీటర్ల ఉందన్నారు. ఉపాధి హామీ పథకం ద్వారా భూగర్భ జలాల పెంపుకు చెక్ డామ్స్, నీటికుంటల నిర్మాణాలు జరుగుతున్నాయన్నారు.

Similar News

News September 20, 2025

జాతీయ రహదారుల పనులు వేగవంతం చేయాలి: కలెక్టర్

image

నాగపూర్ నుంచి విజయవాడ వరకు నిర్మించనున్న కారిడార్ నిర్మాణంలో పెండింగ్‌లో ఉన్న 12 హెక్టార్ల భూ సేకరణ ప్రక్రియను సత్వరమే పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. నాగపూర్-విజయవాడ కారిడార్, మహాదేవపూర్-కాళేశ్వరం జాతీయ రహదారి వెడల్పునకు అటవీశాఖ భూ కేటాయింపు పురోగతిని సమీక్షించారు. రహదారుల నిర్మాణంలో ఎదురవుతున్న సమస్యలను వేగంగా పరిష్కరించి ప్రాజెక్టులు సత్వరం పూర్తి చేయాలన్నారు.

News September 20, 2025

తిరుమలను వాడుకోవడం CBN, లోకేశ్‌కు అలవాటు: YCP

image

AP: రాజకీయాల కోసం తిరుమల క్షేత్రాన్ని వాడుకోవడం CBN, <<17773731>>లోకేశ్‌<<>>కు అలవాటుగా మారిందని YCP మండిపడింది. ‘పరకామణిలో చోరీకి పాల్పడుతున్న రవికుమార్‌ను పట్టుకున్నది 2023, APLలో. అంటే YCP హయాంలో. పోలీసులు విచారించడంతో అతని కుటుంబ సభ్యులు పశ్చాత్తాపం చెంది రూ.14.43కోట్ల ఆస్తులను TTDకి గిఫ్టురూపంలో ఇచ్చేశారు. ఇది చట్టప్రకారం, కోర్టుల న్యాయసూత్రాల ప్రకారం జరిగింది’ అని ట్వీట్ చేసింది.

News September 20, 2025

D.ed విద్యార్థులకు రేపటి నుంచి సెలవులు

image

D.ed విద్యార్థులకు ఈనెల 21 నుంచి అక్టోబర్ 3 వరకు సెలవులు ఉంటాయని గోపాల్‌పేట్ మండలంలోని డైట్ కళాశాల ప్రిన్సిపల్ శ్రీనివాసులు యాదవ్ తెలిపారు. అక్టోబర్ 4న కళాశాల పునః ప్రారంభం కానున్నదని అన్నారు. దసరా సెలవులను విద్యార్థులు ఆటపాటలతో గడపడంతో పాటు కొంత సమయాన్ని విజ్ఞాన సముపార్జనకు వినియోగించుకోవాలన్నారు. ఈనెల 22 నుంచి 27 డీఈడీ ద్వితీయ సంవత్సరం పరీక్షలు ఉంటాయన్నారు.