News March 7, 2025
అనకాపల్లి జిల్లాలో ఫ్రీ బస్.. మీ కామెంట్

RTC ఉచిత బస్సు ప్రయాణాన్ని జిల్లా వరకే పరిమితం చేస్తామని మంత్రి గుమ్మడి సంధ్యారాణి ప్రకటించారు. అనకాపల్లి జిల్లా వాసులు ఎక్కువగా విశాఖ, శ్రీకాకుళం వెళ్తుంటారు. విశాఖలో ఇంజినీరింగ్ కాలేజీలు ఉండటంతో విద్యార్థినీలు నిత్యం రాకపోకలు సాగిస్తుంటారు. మంత్రి ప్రకటన మేరకు వీరంతా విశాఖ, సిక్కోలు వెళ్లాలంటే టికెట్ కొనాల్సిందే. ఇలా జిల్లా బార్డర్‌లో ఉండే వారికి ఉచిత ప్రయాణం వర్తించదు. దీనిపై కామెంట్.
Similar News
News December 18, 2025
గజ్వేల్: ఒక్క మండల కేంద్రాన్ని దక్కించుకోని కాంగ్రెస్

సిద్దిపేట జిల్లాలోని గజ్వేల్ డివిజన్‌లో అధికార కాంగ్రెస్ ఒక్క మండల కేంద్రాన్ని దక్కించుకోలేకపోయింది. గజ్వేల్ నియోజకవర్గంలోని గజ్వేల్ మున్సిపల్ కాగా, వర్గల్‌లో బీఆర్ఎస్, ములుగు- బీఆర్ఎస్, మర్కూక్- బీఆర్ఎస్, జగదేవపూర్- బీఆర్ఎస్, కుకునూరుపల్లి- బీఆర్ఎస్ దక్కించుకోగా, కొండపాక బీజేపీ ఖాతాలో పోయింది. దీంతో అన్ని మండల కేంద్రాల్లో అధికార పార్టీకి వ్యతిరేక ఫలితాలే మిగిలాయి.
News December 18, 2025
ఆదిపూడిలో వివాహిత సూసైడ్

కారంచేడు మండలం ఆదిపూడి గ్రామంలో బుధవారం ఓ వివాహిత సూసైడ్ చేసుకుంది. స్థానికుల సమాచారంతో కారంచేడు ఎస్ఐ ఖాదర్ భాషా ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టంకు చీరాల ఆసుపత్రికి తరలించారు. బలవన్మరణానికి కారణాలు తెలియాల్సి ఉంది. దీనిపై కేసు నమోదైంది.
News December 18, 2025
బాత్ సాల్ట్ గురించి తెలుసా?

బాత్ సాల్ట్ అనేది ఖనిజాలు కలిసిన ఉప్పు. దీన్ని కేవలం స్నానానికి మాత్రమే ఉపయోగిస్తారు. హిమాలయన్ బాత్ సాల్ట్, డెడ్ సీ బాత్ సాల్ట్… ఇలా చాలా రకాల స్నానపు ఉప్పులు ఉన్నాయి. ముఖంపై మొటిమలు, యాక్నే ఉంటే నీళ్లల్లో బాత్ సాల్ట్ వేసుకొని స్నానం చేస్తే జిడ్డు తగ్గుతుంది. దీంతో పాటు నొప్పులు, అలసట నుంచి ఉపశమనం పొందొచ్చు. ఒత్తిడీ అదుపులో ఉంటుంది. స్కిన్ ఎక్స్‌ఫోలియేషన్‌కూ బాత్ సాల్ట్ సాయపడుతుంది.


